OG Bengaluru : పవన్ కల్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ తో ఆయన ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. నిన్న రాత్రి నుండే దేశవ్యాప్తంగా థియేటర్ల దగ్గర సందడి వాతావరణం ఏర్పడింది.
థియేటర్ల ముందు సంబురాలు నిర్వహిస్తున్నారు. డప్పులు, డీజేలు, డ్యాన్స్ లతో హోరెత్తిస్తున్నారు.
ఇవి కేవలం థియేటర్ల బయటకే పరిమితం కాలేదు. థియేటర్ల లోపలికి కూడా ఎంట్రీ ఇచ్చాయి.
బెంగళూరు లోని కేఆర్ పురం వెంకటేశ్వర థియేటర్ లో they call him OG సినిమాను ప్రదర్శిస్తున్నారు.
షో పడకముందు పవన్ కల్యాణ్ థియేటర్ బయట హంగామా చేశారు.
కత్తులు పట్టుకుని డ్యాన్స్ లు చేశారు. లొల్లి లొల్లి చేశారు.
షో పడగానే థియేటర్ లోపలికి వచ్చారు. స్క్రీన్ ముందుభాగంలో కత్తులు పట్టుకుని విన్యాసాలు చేశారు. కత్తిని అటూ ఇటు విసిరే సరికి అది వెళ్లి స్క్రీన్ కు తగిలంది. స్క్రీన్ చిరిగిపోయింది.
#OG show stopped in KR Puram ,
Cults sword techaru screen chimparu🔥🔥🔥 pic.twitter.com/BxaXdPGDgj— RAJESH U (@Tomtruiseoffl) September 24, 2025
దీంతో సినిమా స్క్రీనింగ్ ఆగిపోయింది. అప్పటి దాకా సినిమా చూడబోతున్నామని సంబురంలో ఉన్నవాళ్లంతా వీళ్ల వేశాలతో ఉసూరుమన్నారు. వేల రూపాయలు పెట్టి టికెట్ కొని స్క్రీన్ చిరగడం ఎలా అనేది చూడటానికి వచ్చినట్టున్నదని బాధపడుతూ వెళ్లిపోయారు.

ఒక మిగతా షోలు అయినా నడపాలని మేనేజ్ మెంట్ కొత్త స్క్రీన్ తెప్పించే ప్రయత్నాల్లో ఉంది. స్క్రీన్ కు దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని మేనేజ్ మెంట్ వెల్లడించింది.
సినిమా వల్ల వచ్చేలాభం ఏంటోగానీ.. ఇలా ఫ్యాన్స్ ఓవరాక్షన్ తో స్క్రీన్ కు బొక్కపడి.. మాకూ పెద్ద బొక్క పడిందని బాధపడుతున్నారు.
Read Also :

