Pawan Kalyan’s sword : ఇవి రాజమౌళి తన సినిమా కోసం తయారు చేసిన కత్తులు కాదు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ఆడుతున్న థియేటర్ కు ఫ్యాన్స్ తీసుకొచ్చిన కత్తులు.
సినిమాలో కనిపించాల్సిన కత్తులు.. థియేటర్ బయట దర్శనమిచ్చాయి. బెంగళూరులో కనిపించిన పరిస్థితి ఇది.
పవన్ కల్యాణ్ నటించిన They call him OG సినిమా ప్రదర్శిస్తున్న బెంగళూరులోని మదివాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సంధ్య థియేటర్ దగ్గర ఇవి కనిపించాయి.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్(Pawan Kalyan’s sword) ఇలా కత్తులు పట్టుకుని వచ్చి థియేటర్ ముందు వీరంగం చేశారు. థియేటర్ ముందు పెట్టిన భారీ భారీ కటౌట్ల దగ్గర, థియేటర్ ఎంట్రన్స్ లో నిలబడి ఫొటోలు దిగారు. హల్చల్ చేశారు.

పబ్లిక్ ఇలా కత్తులు పట్టుకుని తిరగడం.. అవి కూడా ఇంత పెద్ద కత్తులు కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కత్తులను సీజ్ చేశారు.
అయితే.. OG సినిమాలో పవన్ కల్యాణ్ ఇలాంటి కత్తినే పట్టుకుంటారు. అలాగే హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇలాంటి కత్తితోనే వచ్చి హల్చల్ చేశారు.
దీంతో ఫ్యాన్స్ కూడా ఆయననే ఫాలో అయ్యారు. థియేటర్ దగ్గర కత్తులతో రచ్చ చేశారు. ఇది చూసిన పోలీసులు వాళ్ల వీపు చింతపండు చేసి తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారు.
అయితే.. ఆ కత్తులన్నీ కూడా ప్లాస్టిక్ వి కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిజమైన మెటల్ కత్తులు అయి ఉంటే పరిస్థితులు వేరే లా ఉండేవని అంటున్నారు.
Read Also :

