Tamil Nadu :దేశవ్యాప్తంగా అక్రమ సంబంధాలు, హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే భర్తను భార్య హత్య చేయడం లేదంటే భార్యను భర్త హత్య చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది.
కట్టుకున్న భార్య మరొకరితో నగ్నంగా కనిపించడంతో తట్టుకోలేకపోయిన ఓ భర్త ఇద్దరు తలలు నరికేసాడు. ఆ తలలో తన బైక్ మీద పెట్టుకొని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కట్టెలు కొట్టే 48 ఏళ్ల కోలాంజీ అనే వ్యక్తికి తన భార్య 37 ఏళ్ల లక్ష్మికి తంగరసు అనే వ్యక్తితో సంబంధం ఉంది.
Read Also : ఏ బీర్ తాగితే మంచిదంటే.?
అయితే భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది లక్ష్మి.. వీరిద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో కోలాంజీ ఇంటికి రావడంతో అడ్డంగా బుక్కయ్యారు. వారిద్దరిని అలా చూసినా కోలాంజీ కోపంలో కొడవలితో వారిద్దరి తలలు నరికేశాడు.
అనంతరం వారి తలను బైకుకు కట్టేసి వెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి, అక్కడ లొంగిపోయాడు. వంజరం పోలీసులు ఇంట్లో నుంచి తలలు లేని మృతదేహాలను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశారు.కోలాంజీ జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంతో ఆ దంపతుల ముగ్గురు కుమార్తెలను బంధువుల సంరక్షణలో ఉంచారు.
బెంగళూరులో కూడా జూన్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపి, ఆమె నరికిన తలతో సూర్యనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నిందితుడిని హెన్నాగర నివాసి శంకర్ (28) గా గుర్తించారు.
కుటుంబ సభ్యుల కోరికలకు విరుద్ధంగా శంకర్ తన భార్యను వివాహం చేసుకున్నాడని, ఇటీవలే ఆ జంట అద్దె ఇంటికి మారారని పోలీసులు తెలిపారు. జూన్ 3న అతను పని నుండి ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన భార్య మరొక వ్యక్తితో ఉన్నట్లు గుర్తించి వారిపై దాడి చేసి, తరువాత తన భార్యను తల నరికి చంపాడని పోలీసులు తెలిపారు.
హత్య తర్వాత, శంకర్ తలను తన బైక్‌పై తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్‌కు లో లొంగిపోయాడు.
Read Also :
- రేవంత్ సర్కారుకు హైకోర్టు షాక్..!
- ఏడు కొండల వాడా.. ఏంటీ ఈ పంచాయితీ..?
- జూమ్ కరో మ్యాజిక్ దేఖో..!
- TDPలోకి కేసీఆర్ కూతురు..?
- కేటీఆర్ ను ఇరికించబోయి ఇరుక్కున్న రేవంత్ రెడ్డి..?

