JIO: రిలయన్స్ వార్షిక సమావేశం (AGM)లో ఈసారి కూడా కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, జియో నుంచి కొత్త టెక్నాలజీలను పరిచయం చేశారు.
జియో హాట్‌స్టార్ కొత్త ఫీచర్స్
రిలయన్స్, వాల్ట్ డిస్నీ కలిసి నడిపిస్తున్న జియో హాట్‌స్టార్ దేశంలో రెండో అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫారంగా మారిందని ఆకాశ్ అంబానీ చెప్పారు. త్వరలోనే ఇతర దేశాలకూ విస్తరించబోతోందని తెలిపారు.
ఇందులో రియా అనే కొత్త ఏఐ అసిస్టెంట్ వస్తుంది. దీని సాయంతో మనం వాయిస్ కమాండ్ ఇచ్చి కావలసిన ఎపిసోడ్ లేదా సినిమా వెంటనే వెతకవచ్చు.
జియో పీసీ
జియో పీసీతో టీవీనే కంప్యూటర్‌గా మార్చుకోవచ్చు. కేవలం కీబోర్డ్‌ను జియో సెటప్ బాక్స్‌కి కనెక్ట్ చేస్తే టీవీ వర్చువల్ కంప్యూటర్‌లా మారిపోతుంది.
ఇది క్లౌడ్ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కడినుంచైనా యాక్సెస్ చేయవచ్చు. అవసరానికి తగ్గట్టు మెమరీ, స్టోరేజ్, కంప్యూటింగ్ పవర్ పెంచుకునే వీలుంది.
జియో ఫ్రేమ్స్
జియో ఫ్రేమ్స్ అనే స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా పరిచయం చేశారు. వీటితో ఫోన్ కాల్స్ చేయవచ్చు, ఫొటోలు తీయవచ్చు, మ్యూజిక్ వినవచ్చు. ఇందులో జియో వాయిస్ ఏఐ ఉంటుంది మరియు అన్ని భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది.
అయితే దీని ధరను ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం జియో వెబ్‌సైట్‌లో ఇంట్రెస్ట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మాత్రమే ఉంది.
మొత్తానికి ఈ ఏజీఎంలో జియో పీసీ, జియో ఫ్రేమ్స్, జియో హాట్‌స్టార్ ఏఐ ఫీచర్స్ వంటి కొత్త ఆవిష్కరణలను ప్రకటించారు.
Read Also : నభానటేష్ ఇలా మారిందేంటి.?

