Saudi Arabia : మొన్న అమెరికా.. ఇప్పుడు సౌదీ అరేబియా..! భారత్ కు షాక్.!

Saudi Arabia big shock to india

Saudi Arabia : నరేంద్రమోడీ పాలనలో దేశం దూసుకుపోతోందని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. అలాగే దౌత్యపరమైన సంబంధాలు గతంలో కంటే అద్భుతంగా మెరుగుపడుతున్నాయని చెప్పుకుంటోంది.

కానీ వాస్తవ పరిస్థితి మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటికే భారత్ కు అమెరికా హ్యాండిచ్చింది. 50 శాతం సుంకాలతో చుక్కలు చూపెడుతోంది.

ఇప్పుడు సౌదీ అరేబియా(Saudi Arabia) కూడా ఎదురుతిరిగింది. మన శత్రు దేశమైన పాకిస్తాన్ తో చేతులు కలిపింది. కేవలం దౌత్య, వాణిజ్య సంబంధాలే కాదు.. యుద్ధ సమయాల్లో సహకారంపైనా వీరి మధ్య ఒప్పందాలు జరిగాయి.

Read Also :

సౌదీ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ అక్కడికి వెళ్లారు. ఆయనకు సౌదీలో ఘన స్వాగతం లభించింది. యుద్ధ విమానాలతో వెల్కం చెప్పారు.

Pakistan Prime Minister Shehbaz Shari

రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా మరో దేశం సహకారం అందించేలా అగ్రిమెంట్ జరిగింది. ఒకవేళ పాకిస్తాన్ పై భారత్ యుద్ధం చేస్తే..పాక్ కు మద్దతుగా సౌదీ వస్తుందన్నమాట.

ఈ విషయాన్ని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్‌ బిన్ సల్మాన్ ప్రకటించారు.

దీనిపై భారత్ స్పందించింది. తమకు దేశ సమగ్రతే ముఖ్యమని చెప్పింది.