Voter id:రెండు ఓటర్ కార్డులు ఉంటే ఖతమే..!

Voter id:ఇటీవల ఓటరు కార్డులకు సంబంధించిన ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి విస్తృతంగా వస్తున్నాయి. ముఖ్యంగా ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓటరు కార్డులు ఉండటం గమనించబడుతోంది. దీనిపై ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఒకటికి మించి ఓటరు కార్డులు కలిగి ఉండటం నేరమని, చట్టపరంగా శిక్షార్హమని పేర్కొంది.

ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం, ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్‌ 31 కింద ఒకరికి రెండు ఓటరు కార్డులు ఉంటే అది నేరంగా పరిగణించబడుతుంది. ఈ నేరానికి గరిష్టంగా ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎవరి వద్దైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓటరు కార్డులు ఉన్నట్లయితే, ఒక్క కార్డును మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని తప్పనిసరిగా స‌రెండర్ చేయాలని హెచ్చరించారు.

అలాగే ఓటరు జాబితాలో ఒకే వ్యక్తి పేరు రెండు చోట్ల ఉంటే, ఒకచోట మాత్రమే ఉంచుకోవాలన్నారు. మిగిలిన చోట తన పేరును తొలగించుకోవాలంటే ఫారం-7 నింపి ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో కూడా సులభంగా చేయగలిగేలా ఏర్పాట్లు ఉన్నాయని ఈసీ అధికారులు వివరించారు.

READ ALSO   

           ఈ బ్యూటీ ఎవరో తెలుసా 

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ మీడియా–పబ్లిసిటీ సెల్‌ ఛైర్మన్‌ పవన్‌ ఖేడా పేరు తాజాగా ఈ వివాదంలో ప్రస్తావనకు వచ్చింది. ఆయనకు రెండు ఓటరు కార్డులు ఉన్నాయన్న ఫిర్యాదు రావడంతో, ఎన్నికల సంఘం ఆయనకు నోటీసు పంపింది. దీనిపై స్పందించిన పవన్ ఖేడా, ఎన్నికల అధికారుల తీరును తప్పుపట్టారు. తన పేరు ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. తనపై వచ్చే ఆరోపణలన్నీ ఎన్నికల సంఘం లోపభూయిష్టమైన విధానాల కారణంగానే ఉత్పన్నమయ్యాయని ఆయన తెలిపారు.

మొత్తానికి ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది – ఒకరికి ఒకే ఓటరు కార్డు మాత్రమే చెల్లుబాటు అవుతుందని, డూప్లికేట్ కార్డులు ఉంటే వెంటనే వాటిని రద్దు చేయించుకోవాలని. లేకుంటే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.