Revanth Reddy : ప్యాలెస్ లో సర్కారు, వరదలో జనం..!

Revanth Reddy and government not responding on flood victims in telangana

Revanth Reddy : రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడని చెబుతుంటారు.

ఇప్పుడు తెలంగాణలో కూడా   పరిస్థితి అలాగే ఉంది. ఓ వైపు వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతోంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వేరే పనుల్లో బిజీగా ఉంది.

రాష్ట్రంలోని కామారెడ్డి, నిర్మల్ జిల్లాలు దాదాపుగా నీట మునిగిపోయాయి. వేలాదిమంది వరదల్లో చిక్కుకున్నారు.

ఇలాంటి సమయంలో ఆగమేఘాల మీద సహాయక చర్యలు చేపట్టాలి. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం మూసీ, స్థానిక ఎన్నికల పనుల్లో బిజీగా ఉంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti vikramarka), మంత్రులు.. కాంగ్రెస్ ముఖ్యనేతలంతా రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు.

లోకల్ బాడీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి.? 42 శాతం రిజర్వేషన్ (42 percent reservation) ఇవ్వలేకపోయాం కదా… దీనివల్ల ఎలాంటి వ్యతిరేక ప్రభావం ఉంటుందనే అంశాలపై చర్చించారు.

ఇవే కాదు.. రాష్ట్రంలో ఒలింపిక్ గేమ్స్ (Olympic  games)నిర్వహణపైనా ముఖ్యమంత్రి ఇవాళ (28 ఆగస్ట్ 2025)పలువురితో సమీక్ష నిర్వహించనున్నారు. క్రీడా రంగానికి సంబంధించిన పలువురితో ఆయన భేటీ అవుతారు.

Revanth reddy review on musi river development

బుధవారం (27 ఆగస్ట్ ) రోజున కూడా ముఖ్యమంత్రి ఇదే పనిచేశారు. మూసీ రివర్ డెవలప్ మెంట్ (Musi river development) పనులపై అధికారులతో రివ్యూ చేశారు.

పొద్దంతా కూడా అధికారులతో దానిపైనే సమీక్ష నిర్వహించారు. పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు.

అంతేకాదు.. ఒలింపిక్ గేమ్స్ కోసం హైదరాబాద్ లో ఒక ఆర్టిఫీషియల్ బీచ్ (Artificial beach in Hyderabad) ను కూడా నిర్మించాలని సర్కారు ప్లాన్ చేస్తోంది. వీటన్నింటిపైనా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షలు జరుపుతున్నారు.

కానీ రాష్ట్రవ్యాప్తంగా వరదలతో (floods)అతలాకుతలమవుతున్నా.. జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి మాత్రం ఆయన బయటకు రావడం లేదు. ప్రజలను పరామర్శించేందుకు సీఎంగానీ.. మంత్రులు గానీ వెళ్లడం లేదు.

ప్రజల నుంచి విమర్శలు వచ్చే సరికి.. వర్షాలు, వరదలపైనా సమీక్ష జరిగింది అంటూ ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నారు.

అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలపై ఎంత పట్టింపు ఉంది…? ఓట్లు, రాజకీయాలపై ఎంత పట్టింపు ఉందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం ఈ వీడియోలో చూడండి.