Sairaj : 18 ఏళ్ల సైరాజ్ కు బంగారు పతకం..!

saraj pardeshi

sairaj : కేవలం 18 ఏళ్ల వయసులోనే సైరాజ్ పార్దేశీ అద్భుత విజయాన్ని సాధించాడు. 2025 కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్లో జూనియర్ మెన్స్ 88 కేజీ విభాగంలో బంగారు పతకం గెలిచాడు.

అతడు మొత్తం 348 కేజీలు (స్నాచ్‌లో 157 కేజీ + క్లీన్ & జర్క్‌లో 191 కేజీ) ఎత్తి కొత్త జూనియర్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా సీనియర్ విభాగం విజేత సాధించిన 347 కేజీలను కూడా అధిగమించాడు.

తన ఆరు లిఫ్ట్స్‌ను ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేసి, అద్భుతమైన శక్తి, ధైర్యం, నమ్మకం చూపించాడు. ఈ విజయంతో సైరాజ్ పార్దేశీ భారత వెయిట్‌లిఫ్టింగ్‌లో వచ్చే తరం స్టార్గా గుర్తింపు పొందాడు.