Sharwanand : శర్వానంద్ విడాకులు.. రూమర్స్ క్లియర్.!

twist in sharwanand divorce issue

Sharwanand : వివాహాల్లో మనస్పర్ధలు సహజమే, కానీ నేటి జనరేషన్ చిన్న కారణాలకి విడిపోతున్నారు. సినిమా రంగంలో అయితే మరింత మామూలు. శర్వానంద్ కూడా ఇప్పుడు ఈ బాటలో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

2023లో రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు శర్వానంద్. గతేడాది లీలావతి అనే పాప పుట్టింది. కానీ, ఇప్పుడు వాళ్ల మధ్య కలతలు, మనస్పర్ధలు పెరిగి విడిపోతున్నారట. పాప తల్లి దగ్గర కొన్ని రోజులు, తండ్రి దగ్గర కొన్ని రోజులు అని ఒప్పందం కూడా అయ్యిందట.

Read Also : 2025 బతుకమ్మ పాటలు ఇవే..!

ముందు కూడా విడాకుల రూమర్స్ వచ్చి, తేలిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఆదే హాట్ టాపిక్. విడాకుల వార్తలు రూమర్స్ అని ఫ్యామిలీ సోర్సెస్ చెబుతున్నాయి.  డివోర్స్ లేదు, ప్లాన్స్ లేవు.  శర్వా షూటింగ్‌తో బిజీ, టెంపరరీ గ్యాప్ మాత్రమే. రూమర్స్ క్లియర్ అన్నమాట.

శర్వా కెరీర్‌లోకి వెళ్తే… చిన్న పాత్రలతో స్టార్ట్ – శంకర్ దాదా ఎంబీబీఎస్, సంక్రాంతి. తర్వాత ప్రస్థానం, గమ్యం, రన్ రాజా రన్‌తో టర్నింగ్ పాయింట్.!

ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు వంటివి హిట్స్. కానీ ఇటీవల ఫ్లాప్స్‌తో కొంచెం డౌన్. ఇప్పుడు #Sharwa36లో మోటార్ సైకిల్ రేసర్‌గా కనిపిస్తున్నాడు. అభిలాష్ కంకర్ డైరెక్షన్, UV క్రియేషన్స్ ప్రొడక్షన్.

మాళవికా నాయర్ హీరోయిన్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు. హైదరాబాద్‌లో రేస్ సీన్స్ షూట్ చేస్తున్నారు  మరో ట్విస్ట్ రీసెంట్‌గా “ఓమీ” ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు.

Sharwanand omi productions

క్రియేటివిటీ, యూనిటీ, సస్టైనబులిటీతో 100% నాచురల్ స్టోరీస్ తీసుకువస్తానట. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీద ప్రారంభించాడు.

Read Also :