Pawan kalyan : పవన్ కల్యాణ్ కు భారీ షాక్..!

they call him og movie piracy on websites

Pawan kalyan : ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా.. ఎంత ఖర్చుపెట్టినా.. పాపం పైరసీ తిప్పలు పవన్ కల్యాణ్ కు కూడా తప్పలేదు. సాధారణంగా సినిమా రిలీజైన రోజు సాయంత్రానికి గానీ, మరుసటి రోజు గానీ పైరసీ రావడం చూస్తుంటాం.

కానీ ఓజీ సినిమా మాత్రం రిలీజైన రోజు మధ్యాహ్నామే పైరసీ వచ్చేసింది. Movierulz అనే పైరసీ వెబ్ సైట్ లో ఈ సినిమా దర్శనమివ్వడంతో అంతా షాక్ అయ్యారు.

og piracy

థియేటర్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నా పైరసీ ఎలా జరుగుతోందనేది అంతు పట్టడం లేదు. సినిమా మూవీ రూల్జ్ వెబ్ సైట్ లో పెట్టారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడంతో జోరుగా ప్రచారం జరిగింది.

they call him og piracy

ఇంత పెద్ద సినిమాకు..  యాంటీ పైరసీ టీం లేదా.? వాళ్లంతా ఏం చేస్తున్నారని పవన్ కల్యాణ్ (Pawan kalyan)ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ను పొట్టు పొట్టు తిడుతున్నారు.

లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా పైరసీ కాకుండా కాపాడుకున్నారు.. మూవీ రూల్స్ వాడు దాన్ని పైరసీ చేయలేకపోయాడు. ఈ సినిమా పైరసీ అవడం ఏంటని నవ్వుకుంటున్నారు.

movierulz-they call  him og

పైరసీని ఎంకరేజ్ చేయకండి అంటూనే చాలా మంది మూవీ రూల్జ్ లో ఓజీ సినిమా ఉన్న స్క్రీన్ షాట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Read Also :