తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన నివేద పేతురాజ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. నిశ్చితార్థం పూర్తయ్యిందని ఆమె సోషల్ మీడియాలో ప్రకటించారు.
తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో నటిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి నివేద పేతురాజ్ (Nivetha Pethuraj) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ ప్రకటించారు. ఇప్పటికే ఆమె నిశ్చితార్థం కూడా పూర్తయింది.
నివేదకు జీవిత భాగస్వామి కానున్న వ్యక్తి పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్. ఆయన దుబాయ్‌లో వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ బయటికి ఈ విషయాన్ని వెల్లడించలేదు. తాజాగా ఎంగేజ్‌మెంట్ అనంతరం అధికారికంగా అందరికీ శుభవార్తను తెలియజేశారు. ఇదే ఏడాదిలో వారి వివాహం జరగనున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయంపై నివేద మరిన్ని వివరాలు చెప్పనున్నారు.

తమిళనాడుకు చెందిన నివేద 2016లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ వెంటనే తెలుగులో ‘మెంటల్ మదిలో’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం వంటి సినిమాల్లో నటించారు. అయితే, ఆశించిన స్థాయి ఖ్యాతి మాత్రం రాలేదు. ప్రస్తుతం కొత్త సినిమాల గురించి స్పష్టత లేదు.
నటన, మోడలింగ్‌తో పాటు కారు రేసింగ్‌లో కూడా తన ప్రతిభను చూపించిన నివేద, మధురైలో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ట్రోఫీ గెలుచుకున్నారు.
Read Also :