Mohanlal : మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే

dada saheb phalke award to mohanlal

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కి దాదాసాహెబ్ ఫాల్కే(dada saheb phalke) అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2023 సంవత్సరానికి గాను ఆయనకు అవార్డు ప్రకటించింది. ఈ నెల 23న అవార్డు ప్రదానం చేయనున్నారు.

సినిమా రంగంలో చేసిన సేవలకు గాను ఈ అవార్డు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఆయన నటించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సినిమాలలో యాక్టింగ్ చేశారు. నటుడిగానే కాదు.. నిర్మాత, దర్శకుడిగా కూడా ఆయన రాణించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయనకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ లాల్(Mohanlal) గొప్ప నటుడని కీర్తించారు. దశాబ్దాలుగా మలయాళ సినిమాపై చెరగని ముద్ర వేశారన్నారు. కేరళ సంప్రదాయానికి పెద్ద పీట వేశారన్నారు. భావితరాలకు ఆయన ఆదర్శంగా ఉంటారన్నారు.

Read Also : రాజకీయాలకు కడియం శ్రీహరి గుడ్ బై…!