ThumbsUP : మందుబాబులు సిట్టింగ్ లో కూర్చున్నాక రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు రా కొడితే.. మరికొందరు వాటర్ లేదా కూల్ డ్రింక్స్ కలుపుకొని తాగుతారు. మరికొందరు.. అయితే ఏకంగా మందు బీర్ కలిపి కొడతారు. ఇది మంచి పద్దతి కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మందులో కూల్ డ్రింక్స్ కలిపి తాగడం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కూల్ డ్రింక్స్ కలిపి తాగితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కూల్ డ్రింక్స్‌లో (ThumbsUP)కార్బొనేషన్ ఉంటుంది (కార్బన్ డయాక్సైడ్ బుడగలు). ఈ కార్బొనేషన్ ఆల్కహాల్‌ను రక్తం వేగంగా గ్రహించేలా చేస్తుంది. దీనివల్ల చాలా తక్కువ సమయంలోనే మత్తు ఎక్కడం, ఆ ప్రభావం ఎక్కువసేపు ఉండటం జరుగుతుంది.
ఇక కూల్ డ్రింక్స్‌లో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్‌తో కలిపి తాగడం వల్ల శరీరానికి అదనపు కేలరీలు చేరతాయి, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
/afaqs/media/post_attachments/ebc07a324a3e856b8f5f9dd5c6c9eb08089cef36dbcb628c6b73583cfa040457.jpg)
చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలు శరీరంలోని నీటిని గ్రహిస్తాయి. ఇది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. ఇది తలనొప్పి, అలసట వంటి సమస్యలను పెంచుతుంది.
అంతేకాకుండా కూల్ డ్రింక్స్‌లో ఉండే కార్బొనేషన్, ఆమ్లాలు కడుపులో గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలను పెంచుతాయి. ఆరోగ్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం మందులో నీరు (water) లేదా సోడా (soda water) కలిపి తాగడం మంచిదని సూచిస్తున్నారు.

మందుతో నీరు కలిపి తాగడం వల్ల మత్తు నెమ్మదిగా ఎక్కుతుంది. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే, మందులోని అసలు రుచిని ఆస్వాదించడానికి సహాయపడుతుంది.
ఇక సోడాలో చక్కెర ఉండదు. కాబట్టి కూల్ డ్రింక్స్ కంటే ఇది బెస్ట్ అని చెప్పాలి.
ఆరోగ్యపరంగా ఆల్కహాల్‌కు దూరంగా ఉండటమే ఉత్తమమైన మార్గం. ఒకవేళ తాగాల్సి వస్తే, నీరు లేదా సోడాతో తీసుకోవడం మంచిది. అలాగే మితంగా మాత్రమే తాగాలి.
Read Also :

