Urea : తెలుగు రాష్ట్రాల్లో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా కోసం ఎండనక, వాననక క్యూలో నిలబడుతున్నారు.
రెండు మూడు నెలలుగా ఇబ్బందులు పడుతున్నా సర్కారు మాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో అటు దుకాణదారులు కూడా రెచ్చిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా దువ్వూరులో ఏకంగా అర్దరాత్రి యూరియా అమ్మకాలు చేస్తున్నారు. రాత్రి వేళ్లల్లో అమ్మొద్దని అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు.

దువ్వూరు మండలానికి 1289యూరియా బస్తాలు ఇచ్చినట్టు అధికారులు చెప్పారు. ఉదయం 9 గంటల నుండి అమ్మకాలు చేపట్టాలని చెప్పారు.
కానీ.. దుకాణదారులు మాత్రం అర్థరాత్రి వేళలో, ఇష్టారాజ్యంగా యూరియా అమ్మకాలు జరుపుతున్నారు.

ఇదేంటని ప్రశ్నించిన వారిపై మహా నందిశ్వర ట్రేడర్స్ ఓనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా దుకాణం.. మేం ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటాం.. అంటూ ఎదురుతిరిగారు.
Read Also :

