Rajasthan Minister : శభాష్ విద్యాశాఖ మంత్రి..!

Rajasthan Education Minister Refuses Niece’s Request After Late Arrival For RPSC exam

Rajasthan Minister : రాజస్థాన్ లో ఆసక్తికర ఘటన జరిగింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ చేసిన పనికి అంతా శభాష్ అంటున్నారు. అందరు మంత్రులు, అన్ని విషయాల్లో ఇలాగే వ్యవహరించాలని కోరుతున్నారు.

రాజస్థాన్ లో ఇటీవల సీనియర్ టీచర్ రిక్రూట్ మెంట్ పరీక్షను రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (RPSC) నిర్వహించింది. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్(Rajasthan Minister) మేనకోడలు సీమా పరిహార్ (Seema parihar)కూడా ఈ పరీక్ష రాసేందుకు వచ్చారు.

అయితే ఆమె చాలా ఆలస్యంగా వచ్చారు. దీంతో రూల్స్ కు విరుద్ధంగా వెళ్లలేమని వారు అడ్డు చెప్పారు. దీంతో చాలా సేపు సిబ్బందిని వారు బతిమిలాడారు. తాను మంత్రికి మేనకోడలిని అని కూడా చెప్పారు.

అయినా ఎంతకూ ఒప్పుకోకపోవడంతో మంత్రికి ఫోన్ చేశారు. పరిస్థితిని వివరించారు. పరీక్షకు అనుమతించేలా సిబ్బందికి చెప్పాలని కోరారు.

కానీ దీనికి మంత్రి ఒప్పుకోలేదు. “రూల్స్ అందరికి ఒకటే. పరిక్ష రాస్తున్న అభ్యర్థులందరు నాకు ఒకటే.. ఏ ఒక్కరి కోసం నిబంధనల్లో సడలింపులు ఉండవు. నువ్ ఇంటికి వచ్చెయ్” అని మదన్ దిలావర్ చెప్పారు.

దీంతో ఇక చేసేదేం లేక అక్కడికి వెళ్లిపోయారు.

రాజస్థాన్ లోని అట్రులో (atru)ఉన్న కమలా కాన్వెంట్ సెంటర్ దగ్గర ఈ ఘటన జరిగింది. మంత్రి చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

..

Read Also :