Bathukamma sarees : బతుకమ్మ చీరెల విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు మరోసారి మోసం చేసింది. తాము అధికారంలోకి వస్తే బతుకమ్మ పండుగకు రెండు చీరెలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు ఆడిబిడ్డలకు హ్యాండిచ్చింది.
ఇప్పటికే.. కేవలం మహిళా సంఘాల్లో ఉన్నోళ్లకు మాత్రమే చీరెలు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు మరో బాంబ్ పేల్చింది.
ఈ సారి బతుకమ్మ పండుగకు ఒకే చీర ఇస్తామని చెప్పింది. మరొక చీర సంక్రాంతి పండుగకు ఇస్తామని ప్రకటించింది.

అయితే.. అవి కూడా ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేకుండా పోయింది. ఈ నెల 18 నుండే చీరెల పంపిణీ మొదలు పెడతామని చెప్పింది. కానీ నేటీకి (21 సెప్టెంబర్ 2025)కూడా అది పూర్తికాలేదు.
ఎప్పుడిస్తారు.? ఎంతమందికి ఇస్తారనేది కూడా సరైన సమాచారం సర్కారు నుండి రావడం లేదు.
ఈ లెక్కన చూస్తే ఈ పండుగకు చీరెలు రావడం కష్టమే అని ఆడబిడ్డలు ఫిక్సై పోయారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరెల స్కీంను(Bathukamma sarees) ప్రారంభించింది. ప్రతీ బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు చీరెలు పంపిణీ చేసింది.
2023లో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దీనిపైనా హామీ ఇచ్చింది. ప్రతీ సభలో రేవంత్ రెడ్డి కూడా ఈ మాట చెప్పారు.
ఒక్కో ఆడబిడ్డకు మంచి క్వాలిటీ చీరెలు రెండు చొప్పున ఇస్తామని చెప్పింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండో బతుకమ్మ పండుగ వచ్చినా ఇప్పటికీ చీరెలు దిక్కులేవు.
మరిన్ని వివరాలు ఈ కింది వీడియోలో చూడండి
Read Also :

