MODI : లైవ్ లో అడ్డంగా బుక్కైన ప్రధాని మోడీ..!

modi

MODI : ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. రేపటి నుండి జీఎస్టీ సంస్కరణలు అమలు కాబోతుండటంతో ఆయన మాట్లాడారు.

రేపటి నుండి దేశంలో కొత్త చరిత్ర మొదలు కాబోతోందని చెప్పారు. కొత్త జీఎస్టీ శ్లాబులు(GST), మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు చాలా మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కు జీఎస్టీ సంస్కరణలు ఊతమిస్తాయని చెప్పారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా అడుగులు వేస్తున్నామన్న ఆయన.. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఆదాయం మిగులుందని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

గతంలో ఎన్నో పన్నులు ఉండేవని మోడీ అన్నారు. వాటిని 2017లో మార్చి జీఎస్టీ తీసుకొచ్చి కొత్త శకం  మొదలుపెట్టామన్నారు. గతంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్నా పన్నులు కట్టాల్సి వచ్చేదన్నారు.

Read Also : 

అన్ని వర్గాలతో చర్చించి జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చామని మోడీ చెప్పారు. కొత్త జీఎస్టీతో నిత్యావసర వస్తువులన్ని మరింత చౌకగా మారతాయని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు దేశాన్ని మరింత బలంగా మారుస్తాయని వివరించారు.

కొన్ని వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించామని.. మరికొన్నింటిపై 5 శాతం పన్ను మాత్రమే వేశామని మోడీ చెప్పారు.

తాము తీసుకున్న చర్యలతో మధ్య తరగతి జీవితాల్లో ఎంతో మార్పు రాబోతోందని ప్రధాని మోడీ వివరించారు. టీవీ, ఫ్రిజ్‌, స్కూటర్‌, ఇంటి నిర్మాణ ఖర్చు తగ్గుతుందని అన్నారు.

అయితే.. జీఎస్టీ కొత్త సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని మోడీ చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే.. 2017 లో జీఎస్టీ తీసుకొచ్చి 2025 దాకా దేశంలోని పేదలు, మధ్య తరగతి ప్రజలను దోచుకున్నామని మోడీ ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు.

ఇన్నేళ్లు దోపిడీ చేసి.. ఇప్పుడు ఓట్ల కోసమే శ్లాబుల్లో మార్పులు చేశారా అని అడుగుతున్నారు.