Maxivision : మాక్సివిజన్ హాస్పిటల్ ప్రారంభించిన రఘురామకృష్ణం రాజు

maxivision

Maxivision : హైదరాబాద్‌లోని కొంపల్లిలో మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు, మాక్సివిజన్ వ్యవస్థాపకుడు డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి దీనిని ప్రారంభించారు.

తెలంగాణలో తమ 13వ ఆసుపత్రిని ప్రారంభించినందుకు సంతోషంగాఉందని కాసు ప్రసాద్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 65 హాస్పిటల్స్ ఉన్నట్టు చెప్పారు. ప్రజలకు ప్రపంచస్థాయి కంటి చికిత్సలు అందించడమే తమ లక్ష్యమన్నారు.

maxivision

కొంపల్లిలోని హాస్పిటల్ ను 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇందులో ఆధునిక వైద్య సేవలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందించనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

రోబోటిక్ గ్లాకోమా ఆపరేషన్, లాసిక్ – లేజర్ విజన్ కరెక్షన్, రెటీనా సేవలు, గ్లాకోమా చికిత్స, పీడియాట్రిక్ ఆప్తాల్మాలజీ, కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్లు, ఆక్యులోప్లాస్టీ సేవలు అందిస్తామన్నారు.

ఈ హాస్పిటల్ NH 44 మరియు ఔటర్ రింగ్ రోడ్‌ కు దగ్గరగా ఉంటుంది. సుచిత్ర సర్కిల్, దూలపల్లి, బోలారం వంటి ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు.

అక్టోబర్ 31, 2025 వరకు ఫ్రీ కన్సల్టేషన్ తో పాటు ఆప్టికల్ ఉత్పత్తులు, శస్త్రచికిత్సలపై 15% తగ్గింపు ఇస్తామన్నారు.

……………………………………………..

Read Also :