IAS, IPS Transfers : అర్థరాత్రి కీలక అధికారుల బదిలీలు..!

IAS IPS Transfers in telangana

IAS, IPS Transfers : తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కీలక అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అర్థరాత్రి ఉత్తర్వులిచ్చింది.

నిన్న కొత్త డీజీపీని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత పలువురు కీలక అధికారులను స్థానచలనం కలిగించింది.

ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ ను హైదరాబాద్ సీపీగా నియమించింది. స్టీఫెన్ రవీంద్రను పౌరసరఫరాల శాఖకు పంపింది.

 

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్

హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్

 

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్

ఇంటెలిజెనర్స్ చీఫ్‌గా విజయ్‌కుమార్

ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా రఘునందన్‌రావు

సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖ బాధ్యతలు

గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్‌ కుమార్

పౌరసరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర

ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి,

ఫైర్ డీజీగా విక్రమ్‌సింగ్

హైదరాబాద్ క్రైమ్స్ ఏసీపీగా శ్రీనివాసులు

హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతల సీపీగా తసఫీర్ ఇక్బాల్

వెస్ట్‌జోన్ డీసీపీగా అనురాధ

సిద్దిపేట సీపీగా విజయ్‌కుమార్

నారాయణపేట ఎస్పీగా వినీత్,

రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత

రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీగా సందీప్‌కుమార్ ఝా..

Read Also :