Mancherial : కన్నీళ్లు పెట్టించే లవ్ స్టోరీ..!

Mancherial lovers death mystery - hithavarshini-vinay

Mancherial : మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. మంచిర్యాల జిల్లా కొర్విచెల్మలో ప్రేమికులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ప్రాణాలు వదిలారు.

ఒకేసారి ఇద్దరు ఇలా చేయడం విషాదంగా మారింది. హితవర్షిణి హైదరాబాద్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త తెలిసిన వెంటనే ప్రియుడు వినయ్ బావిలో దూకి ప్రాణాలు వదిలాడు.

హితవర్షిణి లేకుండా తానుబతకలేనంటూ ఓ లేఖ రాసి బావిలో దూకాడు.

అయితే ఇద్దరు ఇకేసారి ఆత్మహత్యకు పాల్పడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలు వీరి ప్రేమకు ఒప్పుకోలేదా..? లేకపోతే అమ్మాయికి బలవంతంగా వేరే పెళ్లి  చేసే ప్రయత్నాలేమైనా చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

దీంతో ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

అయితే.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకనే ప్రాణాలు వదిలారని ప్రాథమికంగా తెలుస్తోంది. వీరిద్దరి ప్రేమగాథ విన్నవాళ్లు కన్నీళ్లు పెట్టకుండా ఉండటం లేదు.

ఇంత గాఢంగా ప్రేమించుకున్నవారిని కుటుంబసభ్యులు ఎందుకు విడదీయాలని చూశారనే దానిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Read Also :