Shivadhar reddy : రేవంత్ రెడ్డిని పట్టించిన వ్యక్తే.. ఇప్పుడు పోలీస్ బాస్..!

shivadhar reddy

Shivadhar reddy : తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ఆయన 1994కు బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్ఎల్ బీ సూర్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ కేడర్ లో ఉన్న ఆయన.. విభజన తర్వాత తెలంగాణకు వచ్చారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనను ఇంలిజెన్స్ చీఫ్ గా నియమించారు.

గతంలో 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇంటలిజెన్స్ లోనే ఉన్నారు.

ఇప్పుడు అదే వ్యక్తి(Shivadhar reddy).. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక డీజీపీగా నియమితులు కావడం విశేషం.

Read Also :

శివధర్ రెడ్డి నేపథ్యం ఇదే

  • శివధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామం.
  • ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లో చదువుకున్న శివధర్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్‌ చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి ప్రవేశం.
  • ASPగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పని చేసిన శివధర్ రెడ్డి.. గ్రేహౌండ్స్‌ స్క్వాడ్రన్ కమాండర్ గా‌, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలు.
  • జిల్లాల SP గా, DIG SIB గా మావోయిస్టుల అణిచివేతలో కీలక పాత్ర పోషించిన శివధర్ రెడ్డి.
  • 2014-2016 మధ్యన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన శివధర్ రెడ్డి.
  • 2016 నయీం ఎన్కౌంటర్లో ఆపరేషన్ ను ప్లాన్ చేసిన శివధర్ రెడ్డి.
  • ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావో లో కూడ పని చేసిన శివధర్ రెడ్డి.
  • నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పని చేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించిన శివధర్ రెడ్డి.
  • 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పుల లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపి గా శివధర్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం.
  • అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో రాత్రి పగలు శ్రమించి, అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపి శాంతి భద్రతలను సమర్థంగా కాపాడిన శివధర్ రెడ్డి.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా పనిచేసిన శివధర్ రెడ్డి. పర్సనల్ వింగ్ లో ఐజి, అడిషనల్ డీజీ పని చేసిన శివధర్ రెడ్డి
  • అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీ గాను అనుభవం.2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్ గా మళ్ళీ శివధర్ రెడ్డి నియామకం . ఆగస్టు 2024 లో డీజీపీగా ప్రమోషన్.
  • గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్న శివధర్ రెడ్డి.