Almatti Dam : రేవంత్‌ నిర్లక్ష్యం.. రైతుల భవిష్యత్తు ప్రమాదంలో

Almatti Dam : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అల్మట్టి డ్యామ్‌ ఎత్తు 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచే నిర్ణయం తీసుకోవడం తెలంగాణ రైతులకు “మరణ శాసనం” అవుతుందని అన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో కాలక్షేపం చేస్తుంటే, రాష్ట్ర రైతుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని కేటీఆర్‌ విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఎడారులుగా మారే ప్రమాదం ఉందన్నారు.

పలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌, జూరాలా, రేవంత్‌ ప్రస్తావించే నారాయణపేట్-కోదంగల్‌ LIS అన్నీ పనికిరావని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, కానీ అల్మట్టి ఎత్తు పెంచడానికి కేవలం భూసేకరణకే ₹70 వేల కోట్లు కావాలని కర్ణాటక చెప్పిందని గుర్తు చేశారు. అయితే, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ₹93 వేల కోట్లతో నిర్మాణమై 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తోందని వివరించారు.

Read Also :

కాళేశ్వరం తెలంగాణకు “జీవనాధారం, కల్పవృక్షం, కామధేనువు” అని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఆరోపణలు అబద్ధాలు, చవకబారు ప్రచారమని చెప్పారు.

అల్మట్టి విషయం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ, తెలంగాణ కాంగ్రెస్‌ మౌనం వహించడం ఆశ్చర్యమని అన్నారు. మహారాష్ట్ర సీఎం వెంటనే స్పందించారని, కానీ రేవంత్‌ మాత్రం మౌనం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కి కాళేశ్వరం నీళ్లు వదిలి, ఇప్పుడు కర్ణాటకకు కృష్ణా నీళ్లు వదులుతున్నారని ఆరోపించారు. రైతులతో కలిసి చట్టపరంగా, ప్రజా ఉద్యమం ద్వారా పోరాడతామని కేటీఆర్‌ ప్రకటించారు.