Shobitha:హీరోయిన్ శోభిత ధూలిపాళ్ల గతేడాది అక్కినేని హీరో నాగచైతన్యతో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అద్భుతంగా జరిగింది.
ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు, వారి సన్నిహితులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి తర్వాత అక్కినేని కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన శోభిత సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆమె ఒక సినిమాలో నటిస్తోంది.
షూటింగ్ సెట్లో దిగిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇటీవల షేర్ చేసిన ఫోటోలతో పాటు శోభిత వంట చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. వంట చేయడం మనిషికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యం అని ఆ వీడియోకి క్యాప్షన్ రాసింది.

ఈ వీడియో చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. హీరోయిన్ ఇంత సింపుల్‌గా వంట చేస్తోందా అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా శోభిత వంట ప్రతిభను చూసి కొంతమంది ఫన్నీగా కూడా స్పందించారు. “అక్కా.. మీకు వంట కూడా వచ్చా?” అంటూ సరదాగా కామెంట్లు పెట్టారు.
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పోస్ట్‌కు నాగచైతన్య కూడా స్పందించాడు.
తన భార్య శోభిత వంట చేస్తున్న వీడియోపై, “ఈ నైపుణ్యాల రుచి చూడటానికి ఎదురుచూస్తున్నా” అంటూ సరదా రిప్లై ఇచ్చాడు.

చైతూ ఇచ్చిన ఈ రిప్లై ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యాన్స్ ఈ క్యూట్ కపుల్ మధ్య ఉన్న బాండింగ్‌ని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా స్టార్ హీరోల కుటుంబాలు తమ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయటపెట్టరు. కానీ నాగచైతన్య, శోభిత మాత్రం సోషల్ మీడియాలో కాస్త ఫ్రెండ్లీగా, ఓపెన్‌గా తమ చిన్న చిన్న క్షణాలను పంచుకుంటున్నారు.
దీంతో అభిమానులు మరింతగా వారిని దగ్గరగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట ఫ్యాన్స్‌తో చేసే సరదా సంభాషణలు కూడా నెట్టింట హైలైట్ అవుతున్నాయి.

