Kavitha : బీఆర్ఎస్, కాంగ్రెస్ లను టెన్షన్ పెడుతున్న కవిత..!

brs and congress fearing with kavitha plans in Jubleehills byelection

Kavitha : బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన కవిత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆమె గురించి దేవవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ ఏర్పాటుపై ఆమె ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

కానీ రాజకీయ కార్యకలాపాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జరుగుగుతున్న పరిణామాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు పంటి కింద రాయిలా మారాయి.

జూబ్లీహిల్స్(Jubleehills bypoll) ఉప ఎన్నిక నేపథ్యంలో ఆమె కార్యకలాపాలు రెండు పార్టీలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఆమె చర్యలు ఎవరికి నష్టం చేస్తాయోనని  రెండు పార్టీల నేతలు ఆగమాగం అవుతున్నారు.

కొద్దిరోజుల క్రితం దివంగత నాయకుడు పీజేఆర్ కుమారుడు విష్ణువర్దన్ రెడ్డితో (vishnuvardhan reddy) ఆమె భేటీ అయ్యారు. చాలా సేపు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయని వార్తలు వచ్చాయి.

kavitha kalvakuntla

జూబ్లీహిల్స్ ఎన్నికపైనే వీరిద్దరు చర్చించారని ప్రచారం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై విష్ణువర్దన్ రెడ్డికిమంచి పట్టు ఉంది. దీంతో కవితతో ఆయన భేటీ కావడం రాజకీయంగా దుమారం రేపింది.

అయితే.. తాను దసరా ఉత్సవాలకు ఆహ్వానించేందుకే వెళ్లానని ఆయన ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు.

అటు కాంగ్రెస్ పార్టీకి కూడా కవిత(kavitha) టెన్షన్ పట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమీర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీని చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రపోజ్ చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ స్థానంలో కోదండరాం రెడ్డి, అమీర్ అలీలను ఎమ్మెల్సీలను చేసింది.

బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లడంతో వీరిద్దరి నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో అమీర్ అలీ ఖాన్, కోదండరాం రెడ్డి ఎమ్మెల్సీ పదవులు కోల్పోయారు.

కానీ.. కోదండరాం రెడ్డి(kodandaram reddy) పేరును మరోసారి సర్కారు సిఫారసు చేసింది. అమీర్ అలీ పేరును తొలగించి అజారుద్దీన్ పేరును ప్రకటించింది. దీంతో అమీర్ అలీ ఖాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అమీర్ అలీ ఖాన్ తో (Amer ali khan)కవిత భేటీ అయ్యారు. చాలా సేపు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు కూడా చాలా ఉంటాయి. దీంతో ఆయనను  అక్కడి నుండి పోటీ చేయించే ఆలోచనలో కవిత ఉన్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు.

అదే జరిగితే కొంత మేర మైనార్టీ ఓట్లకు గండి  పడే అవకాశం ఉంది. ఇది ఎవరికి నష్టం కలిగిస్తుందోనని కాంగ్రెస్, బీఆర్ఎస్ లు టెన్షన్ పడుతున్నాయి.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హోరా హోరీగా ఉండే అవకాశముంది. దీంతో ఓట్లలో ఏమాత్రం తేడా జరిగినా పార్టీలు భారీగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

Read Also :