Chandrababu : నెహ్రూది ఫ్యూడల్ విధానం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్లే దేశం ఎదగలేకపోయిందని ఆరోపించారు. ఆయన వల్లే సింగపూర్ వంటి దేశాలతో పోటీ పడలేకపోయామని అన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు సత్యం అనే జర్నలిస్ట్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నెహ్రూ పాలన గురించి, చంద్రబాబు బుద్ధి గురించి క్లియర్ గా వివరించారు. మీరూ చదివేయండి.
రాజకీయాల్లో.. ఏ నాయకుడు కూడా.. ఇంతకుమించి దిగజారలేడూ.. అనుకున్న ప్రతీసారి.. చంద్రబాబు తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ.. ఎంత వరకు దిగజారగలడో.. కొత్త కొసను చూపిస్తుంటాడు. అది.. అతడికి అలవాటే. ఇప్పుడు కొత్తగా.. స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మీద దుమ్మెత్తి పోశాడు.
నెహ్రూను భూస్వామి అనేశాడు. ఆ నోటికి ఏమైనా హద్దూ పద్దూ ఉందా అసలు..! డర్టీయెస్ట్ పొలిటిషియన్ కదా. అతడి సంగతి కాసేపు అలా పక్కన పెట్టి.. ఇక్కడ నెహ్రు గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలి.
సోషలిస్టు భావాలు గల నెహ్రూ… తొలి ప్రధానిగా.. ఈ దేశానికి వేసిన బాటలు… నేటికీ ఫలితాలు ఇస్తున్నాయి.
విదేశాంగ విధానంలో అలీన విధానం కావొచ్చు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కావొచ్చు. ప్రభుత్వ రంగంలో భారీ పరిశ్రమలు కావొచ్చు. ఇలా ఏది తీసుకున్నా… నెహ్రూ ఆలోచనలు కనిపిస్తాయి. ఐఐటీలు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధన సంస్థలు, వ్యవసాయం, నీటిపారుదల ప్రాజెక్ట్స్, ఇలా ఎన్నో రంగాలలో నెహ్రూ అనుసరించిన విధానాలు విప్లవాత్మకం.
1947 నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎన్నో మైలురాళ్లలో నెహ్రూ పాత్ర కనిపిస్తుంది. నెహ్రూ మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఇప్పటికీ ప్రపంచంలో ఏ ఆర్థిక సంక్షోభం ఎదురైనా భారతదేశంపై ప్రభావం పాక్షికంగానే ఉంటుంది.
ఇందుకు కారణం మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థనే. 1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపట్టినప్పుడు కూడా… గ్రామీణ భారతాన్ని విస్మరించలేదు. నెహ్రూ విధానాలను పీవీ దృష్టిలో పెట్టుకునే సరళీకరణ విధానాలు రూపొందించారు.
ఇక చంద్రబాబు చెప్తున్న పెట్టుబడిదారీ సూత్రాలు. ఆనాడు నెహ్రు అనుసరించి ఉంటే ఈ దేశంలో మరో వంద మంది అంబానీలు, మరో వెయ్యి మంది అదానీలు ఉండేవారేమో..! డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేలను హోటల్లో బంధించి పదవుల్లోకి వచ్చే ఇంకో ఇరవై మంది చంద్రబాబులు ఉండేవారేమో.

ఈ ఒక్కడినే ఈ దేశం తట్టుకోలేకపోతోంది. ఇంకో ఇరవై మంది అంటే ఆ ఊహే దారుణంగా భయంకరంగా ఉంది. నెహ్రూ చాలా బ్యాలెన్స్డ్ గా లేకపోతే అప్పుడే మోదీ లాంటి కార్పొరేట్ అనుకూల పాలకుడు, చంద్రబాబు లాంటి ప్రపంచ బ్యాంకు ఏజెంట్ ఆనాడు ప్రధానిగా ఉంటే నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయం మొత్తం కార్పొరేట్ల కబంధ హస్తాల్లో పెట్టేవారు. ఇప్పుడు దేశంలో పేదరికం కోరలు విప్పి కనిపించేది. అసలు మధ్యతరగతి ఉండేది కాదేమో…!
సింపుల్ గా చెప్పాలంటే 734 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన సింగపూర్ దేశంతో 32,87,263 చదరపు కిలో మీటర్లు ఉన్న భారతదేశంతో పోల్చడం చంద్రబాబు అవివేకం, అజ్ఞానం.
మన హైదరాబాద్ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లు. అంటే… జీహెచ్ఎంసీ పరిధి కంటే సింగపూర్ కాస్త పెద్దదేశం అంతే. మోదీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు దిగజారి చేస్తున్న వ్యాఖ్యలు తన మానసిక స్థితిని మరోసారి ప్రూవ్ చేస్తున్నాయి.
ఇప్పటికైనా రాజకీయ నేతలు నెహ్రు విజన్ లో పదో వంతు పాటిస్తే బెటర్. ఈనాటికీ నెహ్రూను తమ రాజకీయ ప్రత్యర్థిగా భావించే నేతలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెహ్రూ మిమ్మల్ని ఇంకా వెంటాడుతున్నాడు.
ఆయన అడుగుజాడలను అనుసరించకుండా ఉండలేకపోతున్నారు. అవి దేశప్రజల మనసులో ఇవే అసలు విధానాలు అన్నట్టు ముద్ర వేసుకున్నాయి.
ఉదాహరణకు… వ్యవసాయం ఒక్కటి చాలదా. రైతుల చేతుల్లోనే వ్యవసాయం ఉండాలి. దాంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని నెహ్రూ భావించారని చెప్తుంటారు.
ఇప్పుడు మోదీ.. కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తే సాధ్యమైందా…? తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అంటే.. ఏంటీ… నెహ్రూ విధానమే గెల్చింది కదా…!
అదీ… నెహ్రూ రేంజ్.
Read Also :

