Breaking News : మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy rajagopal reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన చాలా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పూర్తిగా ప్రతిపక్ష నేతలాగా ఆయన మాట్లాడారు.
నేపాల్ లో(nepal) సర్కారు కూలిపోయినట్టు.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుందని ఆయన హెచ్చరించారు.
యువతతో పెట్టుకోవద్దని, వారిని తక్కువ అంచనా వేయొద్దని అన్నారు.
అలా యువతతో పెట్టుకున్న నేపాల్ లో సర్కారు కూలిపోయిందన్నారు. అలాగే తెలంగాణలో యువతతో పెట్టుకున్న రేవంత్ (revanth reddy)సర్కారు కూలిపోతుందని హెచ్చరించారు.
నేపాల్ లో లాగా సర్కారు కూలిపోతుంది..
రేవంత్ సర్కారుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. pic.twitter.com/vTWyWicCN5
— Prabhakar Venavanka (@Prabhavenavanka) September 17, 2025
నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
నిరుద్యోగులను గాలికి వదిలేయొద్దని.. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంతా భావించారని కానీ.. ఆశించిన మేరకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన అన్నారు.
Read Also :

