AI Street lights : ప్రపంచంలో ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) ఏ స్థాయిలో దూసుకుపోతోందో చూస్తూనే ఉన్నాం. ప్రతీ రంగంలో ఏఐదే పై చేయి కనిపిస్తోంది.
దీంతో తెలంగాణలోనూ పెద్ద ఎత్తున ఏఐ వినియోగం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రాష్ట్రంలో ఏఐ రోడ్లు వేస్తామని ప్రకటించింది.
ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏఐ స్ట్రీట్ లైట్లు(AI Street lights) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy)పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రివ్యూ చేశారు. మున్సిపల్, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో పనిచేసే సోలార్ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పెద్ద పెద్ద సంస్థల నుండి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఐఐటీ వంటి సంస్థలతో ఆడిటింగ్ చేయించాలన్నారు.
ప్రతీ పోల్ ను సర్వే చేయాలని చెప్పారు. అన్ని స్ట్రీట్ లైట్స్ ను కమాండ్ కంట్రోల్ రూంతో అనుసంధానించాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఏఐ ద్వారా వాటిని మానిటరింగ్ చేయాలన్నారు.
గ్రామస్థాయిలో స్ట్రీట్ లైట్ల బాధ్యత సర్పంచ్ లు, ఎంపీడీవోలకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Read Alsoo :

