Aghori lover Varshini : అఘోరీ ఓ వేస్ట్ గాడు.. ప్లేట్ ఫిరాయించిన వర్షిణి..!

aghori-lover-varshini-sensational comments

Aghori lover Varshini : రాష్ట్రంలో లేడీ అఘోరీ వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. లేడీ అఘోరీగా మారిన శ్రీనివాస్ గాళ్ ఫ్రెండ్ వర్షిణి ఇప్పుడు మరో బాంబ్ పేల్చింది.

అఘోరీ అరెస్ట్ తర్వాత కొన్ని నెలల పాటు బయటకు కనిపించని వర్షిణి తాజాగా కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. ఓ తెలుగు ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. అఘోరి(Aghori srinivas) తనను నమ్మించి మోసం చేశాడని చెప్పింది.

aghori girl friend

ఇప్పుడేమో తాను ఎవరో తెలియదు అంటున్నాడని వాపోయింది. తన ఇంటికి వచ్చి తనకు మాయ మాటలు చెప్పి నమ్మించాడని వర్షిణి అంటోంది. రోడ్డు మీద బట్టలు లేకుండా తిరుగుతుంటే బట్టలు ఇచ్చామని అంటోంది. అప్పుడే తనకు పరిచయం ఏర్పడింది అని వర్షిణి తెలిపింది. ఇంటికి వచ్చి పూజలు చేస్తా అని చెప్పి మందు, సిగరెట్ తాగేవాడని వర్షిణి వెల్లడించింది.

aghori girl friend

ఒక్క ఫోన్ తో లక్షలు వస్తాయని మాయ మాటలు చెప్పాడని వర్షిణి (Aghori Varshini lover)అంటోంది. అలా శ్రీనివాస్ ట్రాన్స్ లో పడి పెళ్లి కూడా చేసుకున్నానని వాపోయింది. తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, వాడితో బయటకు వెళ్ళినప్పుడు ఆడపిల్లగా చాలా ఇబ్బందులు పడ్డానని చెబుతోంది.

aghori girl friend varshini

వాడికి పూజలు కాదు కదా.. వందేమాతరం కూడా పాడటం రాదని వర్షిణి సంచనల కామెంట్స్ చేసింది. వాడు అసలు అఘోరానే కాదని, వాడితో ఉన్నన్నాళ్లు వాడి నోటి నుంచి ఒక్క మంత్రం కూడా వినలేదని బయటపెట్టింది.

aghori srinivas lover varshini

వాడి గురించి అసలు నిజాలు తెలిశాకే వదిలేశాను అని వర్షిణి తెలిపింది. ఇపుడు తనకు తన తల్లిదండ్రులే దిక్కు.. వాళ్ళు తనను అర్థం చేసుకున్నారని అంటోంది. అఘోరీ శ్రీనివాస్ వల్ల తన కెరీర్ డ్యామేజ్ అయిందని వాపోయింది.

ఇపుడు టాను కెరీర్ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని తెలిపింది. మళ్ళీ ఆ అఘోరి తనజోలికి వస్తే ఊరుకునేది లేదని, ఆడపిల్లల జీవితాలతో ఆడుకోకు.. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ అని హెచ్చరించింది. వర్షిణి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

కొంతకాలం ప్రేమ తర్వాత, వర్షిణి శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. చావైన బ్రతుకైనా ఒక అఘోరీతోనే అన్న వర్షిణి ఇప్పుడు యూ టర్న్ కావడం పెద్ద షాక్..

కాగా శ్రీనివాస్ ఒక మహిళను పూజల పేరుతో సుమారు రూ.10 లక్షల వరకు మోసం చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసులు శ్రీనివాస్‌ను ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.

Read Also :