TVS NTORQ 150 : యూత్ కోసం స్పెషల్ స్కూటర్ ఇది..!

TVS NTORQ 150 : యూత్ కోసం అద్భుతమైన స్కూటర్ ని లాంఛ్ చేసింది TVS. దేశంలో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్ TVS NTORQ 150 ని తెలంగాణ మార్కెట్ లోకి విడుదల చేసింది. సోమవారం తాజ్ డెక్కన్ లో స్కూటర్ ను లాంఛ్ చేశారు.

6.3 సెకన్లలో 0-60 కిలో మీటర్ల వేగం అందుకోవడం ఈ స్కూట్ ప్రత్యేకత. అలాగే.. ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్‌తో మెరుగైన భద్రత, నియంత్రణ సదుపాయాలు కూడా ఉన్నాయి.

tvs ntorq2025

స్పెషాలిటీస్ : సిగ్నేచర్ MULTIPOINT ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ కాంబినేషన్ ల్యాంప్‌లు & ‘T’- టెయిల్‌ల్యాంప్‌లు, అధునాతన TFT క్లస్టర్‌తో సహజమైన రైడ్ అనుభవం.

అంతేకాదు దీనిని స్మార్ట్ వాచ్, అలెక్సా తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లైవ్ ట్రాకింగ్, నావిగేషన్ మరియు OTA అప్‌డేట్‌లతో సహా 50+ స్మార్ట్ ఫీచర్‌లతో అదరహో అనిపిస్తోంది.

tvs ntorq2025 2

పనితీరు :

TVS NTORQ 150 149.7cc, ఎయిర్-కూల్డ్, O3CTech ఇంజిన్‌..

7,000 rpm వద్ద 13.2 PS, 5,500 rpm వద్ద 14.2 Nm టార్క్‌ను అందించే కెపాసిటీ..

గరిష్ట వేగం : 104 కిలోమీటర్లు ప్రతి గంటకు

కలర్ వేరియంట్లు…

TVS NTORQ 150 – స్టెల్త్ సిల్వర్, రేసింగ్ రెడ్, టర్బో బ్లూ

TFT క్లస్టర్‌తో TVS NTORQ 150 – నైట్రో గ్రీన్, రేసింగ్ రెడ్, టర్బో బ్లూ

tvs ntorq2025 1

ఇక.. స్కూటర్ గురించి.. టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ – హెడ్,కమ్యూటర్ & ఈవీ బిజినెస్ మరియు హెడ్ – కార్పొరేట్ బ్రాండ్ & మీడియా శ్రీ అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ.. యూత్ అభిరుచులకు అనుగుణంగా మోడల్ తో పాటు, సేఫ్టీ ఫీచర్స్ తో స్కూటర్ ను రూపొందిచినట్టు తెలిపారు.

ప్రస్తుతం యూత్ అభిరుచులపై లోతైన విశ్లేషణ చేశామని అన్నారు.

Read Also :