Sony : మొబైల్ యూజర్స్ కి గుడ్ న్యూస్..!

sony IER-EX15C c type ear phone

Sony : ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్స్ మారిపోయాయి. గతంలో అన్నింటికి ఆడియో జాక్ పోర్ట్ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని కంపెనీలు దాన్ని తొలగించాయి. ఆడియో జాక్ స్పేస్ ఇవ్వడం లేదు.

దీంతో అంతా వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ వాడక తప్పని పరిస్థితి. అయితే చాలా మందికి వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ వాడటం ఇష్టం ఉండదు. వాటి నుండి వచ్చే తరంగాల వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని డాక్టర్లు కూడా చెబుతుంటారు.

sony IER-EX15C c type ear phone

అలాంటి వారి కోసం సోనీ ఇండియా (Sony)పెద్ద శుభవార్త చెప్పింది. సోనీ IER-EX15C అనే మొట్టమొదటి C – టైప్ వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌ను తీసుకొచ్చింది. ఇవి 5mm డ్రైవర్, హై-కంప్లైన్స్ డయాఫ్రాగమ్‌తో వస్తాయి. ఫుల్ క్వాలిటీ ఆడియోతో పాటు.. బాస్ కూడా బాగుంటుంది. పాటలు వినే వారికి కూడా ఇవి వంద శాతం సంతృప్తిని ఇస్తాయని సంస్థ చెబుతోంది.

కనెక్టివిటీ : C-టైప్ ఇయర్‌ఫోన్. ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌, ల్యాప్‌టాప్‌ లు దేనికైనా వాడొచ్చు.

డిజైన్ : సోనీ IER-EX15C కాంపాక్ట్. తేలికైన డిజైన్. చిక్కుపడకుండా ఉండేలా కేబుల్ ఇస్తున్నారు. కేబుల్ అడ్జస్టర్‌ కూడా ఇస్తున్నారు.

sony IER-EX15C c type ear phone

ఇన్-లైన్ రిమోట్ : ఇందులో ఇన్-లైన్ రిమోట్ కూడా ఉంటుంది. ఆడిమో పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి వీలు కలుగుతుంది. పాటలను ప్లే చేయండి, పాజ్ చేయడం కూడా చేసుకోవచ్చు. కాల్స్ రిసీవ్ చేసుకోవడం.. వాయిస్ అసిస్టెంట్ ను యాక్టివేట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.

ఇయర్ టిప్స్ : ఇవి మూడు రకాల సైజుల్లో (S, M, L) హైబ్రిడ్ సిలికాన్ ఇయర్ టిప్స్‌తో వస్తాయి. ఇది వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని ఇస్తుంది.

ధర : సోనీ IER-EX15C వైర్డ్ ఇయర్ ఫోన్స్ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. నలుపు, తెలుపు, నీలం, పింక్ రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు. దీని ధర ₹2,490.. రూ.1990కే అందిస్తున్నారు. అన్ని సోనీ స్టోర్స్, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

Read Also :