Police : ఇష్టారాజ్యంగా కేసులు పెడితే ఊరుకునేది లేదని తాజాగా తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. సోషల్ మీడియా కేసుల్లో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడింది. అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ లు రాస్తే బాగోదని హెచ్చరించింది.
అయితే ఇదే సమయంలో హర్యానాలో(Haryana) ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఏకంగా ఎస్సైని లాకప్ పెట్టింది కోర్టు.
సిర్సాలోని (sirsa)ఒక పోలీస్ స్టేషన్ లో సీఐగా ఉన్న రాజేశ్ కుమార్ ను గంటపాటు లాకప్ లో పెట్టింది. దీనిపై హర్యానాలోని పోలీసులు రగిలిపోతున్నారు.
2021లో సీఐ రాజేశ్ కుమార్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్య జరిగింది. ఆ కేసుకు సంబంధించి.. కోర్టుకు వచ్చి సీఐ సాక్ష్యం చెప్పాల్సి ఉంది.
కానీ చాలా అవకాశాలు ఇచ్చినా కూడా ఆయన కోర్టుకు హాజరుకాలేదు. కోర్టు ఆదేశాను పట్టించుకోలేదు. దీంతో ఎట్టకేలకు నిన్న కోర్టుకు రప్పించారు.
వచ్చాక గంటపాటు.. కోర్టులో ఉన్న లాకప్ లో పెట్టారు. హర్యానాలోని కైథాల్ స్పెషల్ కోర్టులో ఈ ఘటన జరిగింది. అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి మోహిత్ అగర్వాల్ ఈ ఆదేశాలు ఇచ్చారు.
Judge puts police officer in lockup for one hour for non appearance as witness in a murder case despite repeated reminders
HAIL THE ACTION
Anyone who disrespects courts & law must be taught a lesson including women who file case but never appearpic.twitter.com/mUu8spFtBc
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) September 12, 2025
కోర్టు ఆదేశాలకు ధిక్కరిస్తే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో చూపించడానికే న్యాయమూర్తి ఇలా చేశారని న్యాయవాదులు అంటున్నారు.
కానీ తమ మనోభావాలను న్యాయమూర్తి అవమానించారని పోలీసులు మండిపడుతున్నారు. ఇది తమ మనోధైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుందని అంటున్నారు.
Read Also :

