Vijay Rupani : బీజేపీ జాతీయ నాయకత్వం తమ సొంత మాజీ ముఖ్యమంత్రి కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijay Rupani)జూన్ 12 నాడు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రాజ్ కోట్ లో ఆంత్యక్రియలు జరిగాయి.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర బీజేపీ అగ్రనేతలు హాజరయ్యరు.
అయితే ఈ అంత్యక్రియలకు దాదాపు రూ.25 లక్షల దాకా ఖర్చు అయ్యింది. లెక్క ప్రకారమైతే ఇవి బీజేపీ(BJP) చెల్లించాలి. చెల్లించింది కావొచ్చని కుటుంబసభ్యులు కూడా భావించారు.
కానీ అంత్యక్రియల రోజు పువ్వులు సప్లై చేసిన వాళ్లు, టెంట్లు, ఇతర ఏర్పాట్లు చేసిన వారు తాజాగా.. విజయ్ రూపానీ కుటుంబసభ్యులను సంప్రదించారు. రూ.25 లక్షలు బిల్లు అయ్యిందని చెల్లించాలని కోరారు.
బీజేపీ చెల్లించలేదా అని అడిగితే.. వాళ్లు ఇవ్వలేదు కాబట్టే మీ దాకా వచ్చామని వారు చెప్పారు. దీంతో ఆ డబ్బు మొత్తం వారు చెల్లించారు.
అయితే.. ఇది డబ్బుల విషయం కాదని.. జీవితాంతం విజయ్ రూపానీ బీజేపీ కోసం పనిచేశారని.. అలాంటి వ్యక్తికి బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. బీజేపీ వ్యవహరించిన తీరు తీవ్ర ఆవేధన కలిగించిందన్నారు.
Read Also :

