Actress : నటి ప్రియా మరాఠే కన్నుమూత..!

priya marathe

Actress:  ప్రముఖ టీవీ మరియు మరాఠీ సినీ నటి ప్రియా మరాఠే ఇకలేరు. కేవలం 38 ఏళ్ల వయసులోనే ఆమె కేన్సర్‌తో పోరాడుతూ ఆగస్ట్ 31, 2025న ముంబయిలోని మీరారోడ్‌లోని తన నివాసంలో కన్నుమూశారు.

ప్రియా, పవిత్ర రిష్తా సీరియల్‌తో ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యారు. అలాగే సాథ్ నిభానా సాథియా వంటి మరెన్నో సీరియల్స్‌లో నటించి హిందీ, మరాఠీ ప్రేక్షకులను అలరించారు. టెలివిజన్‌తో పాటు మరాఠీ సినిమాల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించారు.

ప్రియాకు భర్త నటుడు శంతను మోఘే. ఆమె మరణంతో ఆయన, కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఆమె చివరిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తతో కలిసి పంచుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

తన నటనతో, చిరునవ్వుతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ప్రియా మరాఠే అకాల మరణం వినోద ప్రపంచాన్ని కలచివేసింది.

Read Also :

           యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఉదయభాను

            రకుల్ మెడపై ప్యాచ్‌..!