India : నోయిడాలో దేశంలోనే మొదటి టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీని ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్ కంపెనీ, అమెరికా కంపెనీ కార్నింగ్ సహకారంతో నిర్మించింది.
మొదటి దశలో రూ.70 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్లాంట్ ఏడాదికి 2.5 కోట్ల గ్లాస్ యూనిట్లు తయారు చేస్తుంది. దీని వల్ల 600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ, పరిశోధన (రిసెర్చ్) చాలా ముఖ్యం కాబట్టి, కంపెనీ రీసెర్చ్ టీమ్‌ను 40 మందినుంచి 400 మందికి పెంచాలని సూచించారు.
ఆప్టిమస్ చైర్మన్ అశోక్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, వచ్చే ఏడాదిలో రెండో దశలో రూ.800 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని పెంచి, ఏడాదికి 20 కోట్ల గ్లాస్ యూనిట్లు తయారు చేయాలనే ప్రణాళిక ఉందని తెలిపారు.
Read Also : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఉదయభాను

