Apollo : హాస్పిటల్ కాదు.. వైద్య రంగ ఉద్యమం..!

Apollo hospitals success story

Apollo : వైద్యరంగంలో తాము ప్రజలకు చాలా సేవ చేస్తున్నామని అపోలో హస్పిటల్ ప్రకటించింది. తమ 42వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ ప్రగతిని వెల్లడించింది.

1983లో తొలి కార్పొరేట్ ఆసుపత్రిగా ప్రారంభమైన అపోలో(Apollo), నాలుగు దశాబ్దాలలో 200 మిలియన్లకు పైగా ప్రజలకు సేవలు అందించిందని తెలిపింది. 185 దేశాలకు తమ సేవలను విస్తరించినట్టు వివరించింది.

ఈ ప్రయాణంలో, అపోలో హాస్పిటల్స్ 5.1 మిలియన్లకు పైగా శస్త్రచికిత్సలు, 27,000కు పైగా అవయవ మార్పిడులు చేసినట్టు తెలిపింది. అలాగే 22,000కు పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలు చేశామంది.

అపోలో 24/7 డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ ద్వారా 40 మిలియన్లకు పైగా భారతీయులకు సేవలు అందించామని తెలిపింది. ఆరోగ్య సంరక్షణలో నాణ్యతను పెంచడం ద్వారా, భారతదేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా మార్చడంలో అపోలో కీలక పాత్ర పోషించిందని చెప్పింది.

భవిష్యత్తులో రోబోటిక్స్, ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పింది.

అపోలో గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మాట్లాడుతూ.. 1983లో అపోలో హాస్పిటల్ ప్రారంభం మాత్రమే కాదని.. ఆరోగ్య రంగంలో ఒక ఉద్యమం పురుడుపోసుకుందని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా, ఆ ఉద్యమం 200 మిలియన్ల జీవితాలను తాకిందన్నారు.

Read Also :