OG Fan Review : ఓజీ.. ఓ అమ్మోరు కత్తి!.. నీకు ఋణపడిపోతాం సుజీత్

they call him og movie fan review

OG Fan Review : ఓజీ సినిమా విడుదలతో ఫ్యాన్స్ అంతా పిచ్చెక్కిపోతున్నారు. సినిమా రిలీజ్ కు ముందే హైప్ తో పీక్స్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కావడంతో థియేటర్లలోకి పరుగులు పెడుతున్నారు.

స్క్రీన్ పై పవన్ కల్యాణ్ ను చూస్తూ తన్మయత్వం చెందుతున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే చూసి అదరహో అంటున్నారు.

పవన్ కల్యాణ్ కంటే డైరెక్టర్ సుజిత్ ను ఎక్కువగా మెచ్చుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ స్టేచర్ తగ్గ స్టోరీ రాసి, దాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించాడని అంటున్నారు.

ఓజీ.. ఓ అమ్మోరు కత్తి!

సుజీత్.. సుజీత్.. సుజీత్..
నీకు ఋణపడిపోయినట్టే మెగా అభిమానుమలంతా..
మాకు ఏం కావాలో, ఎక్కడ విన్నావో, ఎప్పుడు చూశావో, ఎలా తీసుకున్నావో తెలియదు గానీ గుండెలు మొత్తం ఆనందంతో నిండిపోయే సినిమా ఇచ్చేసావ్ సామీ..
థాంక్యూ వెరీ మచ్ సుజీత్..
ఇక థమన్ సాబ్…
డ్రమ్ములు వాయించలేదు అతను..
బాంబుల మోత మోగించాడు..
గుండెలు అదిరిపోయాయ్..
రోమాలు నిక్కబొడుచుకొని అలా ఉండిపోయాయ్..
ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నట్టే మలిచారు వాళ్ళిద్దరూ కలిసి ఈ సినిమాను..
ఆకలి తీర్చేశావ్ కళ్యాణ్ అన్నా..
ఏదో వెలితి ఉండేది మా గుండెల్లో..
ఎక్కడో లోటు అనిపించేది మా మనసుల్లో..
మొత్తం క్లియర్..
సాలిడ్ క్లియర్..
ఇది కదా పవన్ కళ్యాణ్ సినిమా అంటే..
ఊచకోత అంటే ఎలా ఉంటదో చూపించావ్..
తెరపై అమాంతం నువ్వే కనిపించావ్..
తెరను నింపేసావ్ నీ నటనతో..
విజృంభణ అంటే ఇదయ్యా నీది..
ఇది అసలైన సిసలైన రూపం..
బాక్సాఫీస్ కూసాలు కదిలిపోయినట్టే..
ఈ తుఫాన్ ఎక్కడ ఆగుద్దో ఊహాతీతం..
ఓజీ సాబ్.. నీకు సలామ్ సాబ్…
మొదటి రోజే వందో నంబర్ కోటితో మొదలవుద్దనిపిస్తుంది..
ఎంతకు చేరుతుందో.. ఎంతవరకూ సాగుతుందో.. ఎక్కడ ఆగుతుందో..
ఎవ్వడూ చెప్పలేడు..!!

Read Also : OG సినిమా రివ్యూ.. థియేటర్లలో పూనకాలే