Pawan kalyan : పవన్ కల్యాణ్ హీరోగా నటించిన OG సినిమా ఈ నెల 25న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్.. కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు.
ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందేనని భీష్మించుకుని కూర్చున్నారు. టికెట్లు ఇప్పటికే మొత్తం సేల్ అయిపోయాయి. బెనిఫిట్ షో టికెట్లకు కూడా భారీ డిమాండ్ ఉంది.
దేశవ్యాప్తంగా ఇదే క్రేజ్ కనిపిస్తోంది. కానీ ఏపీలో పవన్ కల్యాణ్ కు(Pawan kalyan ) ఉన్న క్రేజ్ మామూలుది కాదు. పైగా అక్కడ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.
దీంతో అక్కడ మూవీ క్రేజ్ మరింత జోరుగా ఉంది.
చిత్తూరు జిల్లాలో ఓ అభిమాని.. ఓజీ సినిమా టికెట్ కోసం ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు చేశాడు. థియేటర్ యాజమాన్యం టికెట్ ను వేలం వేయగా ఓ యువకుడు లక్షరూపాయలకు కొనుగోలు చేశాడు.
ఆ లక్ష రూపాయలను థియేటర్ యాజమాన్యం వాడుకోకుండా.. జనసేన పార్టీ ఆఫీస్ కు పంపిస్తామని చెప్పింది. గ్రామాల అభివృద్ధి కోసం ఆ డబ్బులను వినియోగించాలని కోరతామన్నారు.
Read Also :

