BIGG BOSS 9 : బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న నాగార్జున గ్రాండ్‌గా లాంచ్ చేశారు! సెలబ్రిటీలు, కామనర్స్ ఒక్కొక్కరు హౌస్‌లోకి ఎంటర్ అవుతూ డ్యాన్స్‌లు, మాటలతో అదరగొట్టారు.

అయితే, టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ(Shrasti verma) ఎంట్రీ సూపర్ స్పెషల్.! లంగావోణిలో అద్దిరిపోయే లుక్‌తో వచ్చిన శ్రష్టి, నాగ్ అడగగానే ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో’ పాటకు స్టెప్పులేసి స్టేజ్ షేక్ చేసింది.!

నాగ్, “బిగ్ బాస్‌కు(BIGG BOSS 9) ఎందుకు వచ్చావ్?” అని అడగగా, శ్రష్టి మోటివేషనల్ స్పీచ్‌తో అదరగొట్టింది. “ఇక్కడ ఎవరూ మాస్క్ వేసుకోలేరు, అందరి నిజ స్వరూపం బయటపడుతుంది. జీవితంలో కఠిన పరిస్థితులే మన ధైర్యాన్ని బయటకు తెస్తాయి. సోషల్ మీడియా కామెంట్స్, బయటివాళ్లు ఏమనుకుంటారనేది నేను పట్టించుకోను!” అంటూ ఫైర్‌బ్రాండ్‌గా చెప్పింది.

ఆమె డ్యాన్స్, స్పీచ్‌లు చూసి నాగార్జున ఫిదా! “తొందరగా బయటకు వచ్చి కలిసి పని చేద్దాం!” అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు!

శ్రష్టి గురించి చెప్పాలంటే… కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, రియాలిటీ షోలలో మెరిసింది. ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘జైలర్’, ‘విక్రాంత్ రోనా’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ అందించింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఆమె ఎలాంటి రచ్చ చేయబోతుందో చూడాలి ఇక.!

Read Also :

