VSN Murthy : సినిమా జర్నలిస్ట్ వీఎస్ఎన్ మూర్తికి భారీ షాక్ తగిలింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మిని (VSN Murthy ) డ్రెస్సింగ్ గురించి ఆయన ప్రశ్నించారు.
ఈ ఏజ్ లో ఇలాంటి దుస్తులు వేసుకోవడం ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతుందని ఆయన అడిగారు.
దీనికి అప్పుడే మంచు లక్ష్మి రెచ్చిపోయారు. వీఎస్ఎన్ మూర్తికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు.

మగాళ్లను కూడా ఇదే ప్రశ్న అడుగుతారా అంటూ కౌంటర్ ఇచ్చారు. మహిళలపై ఇలా చిన్నచూపు ఎందుకు, కురచబుద్ధి ఎందుకు అంటూ రెచ్చిపోయారు.
అయితే.. ఆమె అక్కడితో ఆగిపోలేదు. ఏకంగా వీఎస్ఎన్ మూర్తిపై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు.
ఎలాంటి కఠినమైన ప్రశ్నలకైనా తాను సమాధానం ఇస్తానని కానీ.. ఇలా మహిళలను కించపరిచే ప్రశ్నలు అడగటం ఏంటని ఆమె మండిపడ్డారు.
..
Read Also :

