Kota Vinutha: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు.. జనసేన పార్టీ నాయకురాలు కోట వినూత (Kota Vinutha)సంచలన లేఖ రాశారు.
మర్డర్ కేసులో అరెస్ట్ అయిన కోట వినూత గత నెలలో జైలు నుండి విడుదల అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
కానీ శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్ ను నియమించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆవేదనను లేఖ రూపంలో రాశారు.
గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి,
sub: శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్ కి ఇవ్వడం పై అభ్యంతరం తెలుపుతూ, పునరాలోచించాలని విజ్ఞప్తి
Sir,
శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్ కు ఇవ్వడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, మహిళలంటే కనీస గౌరవం లేని వ్యక్తికి పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. నాపైన జరిగిన రాజకీయ కుట్రలో ప్రధాన మైన వ్యక్తుల్లో ఈ కొట్టే సాయి ప్రసాద్ ఒకడు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం లోని ప్రెసిడెంట్ సెక్రటేరియట్ టీమ్ కు, మీ రాజకీయ కార్యదర్శి ఎంఎల్సీ హరిప్రసాద్ గారికి, PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి , ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్ గారికి వివరించడం జరిగింది, ఆధారాలు ఇవ్వడం జరిగింది. బహుశా నాకు జరిగిన ఇంత పెద్ద సమస్య మీ దృష్టికి చేరలేదని భావిస్తున్నాను.
ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వం 5 సం. ల్లో అనేక మంది జన సేన కార్యకర్తలు నిజంగా, నిజాయితీగా పని చేసిన వాళ్ళు చాలా మంది ఆలయ చైర్మన్ పదవికి అర్హులు ఉన్నారు, పార్టీ కోసం గ్రామ గ్రామాన ఇంటింటికీ ప్రచారం చేసిన వాళ్ళు, స్థానిక సంస్థల ఎన్నికల్లో దమ్ముగా నిలబడ్డ వాళ్ళు, పోలీస్ ల దగ్గర బూటు కాళ్లతో తన్నించుకున్న వాళ్ళు, పోరాటాలు చేసి కేసులు పెట్టించుకున్న వాళ్ళు ,వీర మహిళలు ఉన్నారు. ఇలా నిజాయితీగా నిజంగా కష్ట పడ్డ వారిని గుర్తించి ఎంపిక చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
దయచేసిన మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉనిన నన్ను భౌతికంగా హతం చెయ్యాలని, రాజకీయాలకు దూరం చేయాలని, క్యారెక్టర్ దెబ్బ తీసే కుట్రలు చేసిన వ్యక్తుల్లో ఒక్కరైనా కొట్టే సాయి ప్రసాద్ కి పవిత్ర పుణ్యక్షేత్ర చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. అర్హులు చాలా మంది నియోజకవర్గంలో జనసేన పార్టీ లో ఉన్నారు వారిని గుర్తించి మీ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతున్నాను.
త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను.
ఇట్లు
శ్రీమతి వినుత కోటా
….
Read Also :
- ట్రెండింగ్ తాతకు షాకిచ్చిన మంచు లక్ష్మి..!
- తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్
- CBI చేతికి ఫోన్ టాపింగ్ కేసు..!
- పొంగులేటి బయోపిక్ లో ఈడీ రెయిడ్స్ సీన్ ఉంటదా.?
- గత్తర లేపుతున్న విజయ్ ఫిగర్

