Chandrababu : ఆటో డ్రైవర్లకు 15 వేలు.. దిమ్మతిరిగే రూల్స్ ఇవే!

chandra babu naidu shock to auto drivers

Chandrababu : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాబోయే విజయదశమి రోజున ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర స్కీం కింద రూ.  15000 అందించనున్నట్లు వెల్లడించారు.

అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్  సూపర్ హిట్టు సభలో సీఎం ఈ ప్రకటన చేశారు. గత వైసిపి ప్రభుత్వం ఇదే వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీ , మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.10,000 ఇచ్చేది. ఇప్పుడు కూటమి  ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.15,000 కు పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఏపీలో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా  ఆటో డ్రైవర్ల ఆదాయం ప్రభావితం కాకుండా ఉండేందుకు ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

దీని కోసం మొత్తం రూ. 435 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే ఈ స్కీమ్ కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా బయటికి రాలేదు కానీ గత ప్రభుత్వం (Chandrababu)అమలు చేసిన రూల్స్ ప్రకారం చూసుకుంటే ..

దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి. ఆటో రిక్షా, ట్యాక్సీ లేదా మ్యాక్సీ క్యాబ్‌ను సొంతంగా కలిగి ఉండి, స్వయంగా నడుపుతున్న డ్రైవర్లు మాత్రమే ఈ పథకానికి అర్హులు. కుటుంబానికి (భార్య, భర్త, మైనర్ పిల్లలు) ఒక వాహనానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

దరఖాస్తుదారుడికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. పేదరిక రేఖకు (BPL) దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలోని ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ అయి ఉండకూడదు (పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు). కుటుంబంలో ఎవరూ ఆదాయ పన్ను చెల్లింపుదారులు అయి ఉండకూడదు.

కుటుంబానికి చెందిన ఇంటి స్థలం పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు గజాలకు మించి ఉండకూడదు. కుటుంబం కలిగి ఉన్న తడి భూమి 3 ఎకరాలకు, లేదా పొడి భూమి 10 ఎకరాలకు మించి ఉండకూడదు. ఒకవేళ తడి,  పొడి భూమి కలిపి ఉన్నట్లయితే 10 ఎకరాలకు మించి ఉండకూడదు.

కుటుంబం  నెలవారీ విద్యుత్ వినియోగం (గత 6 నెలల సగటు) 300 యూనిట్లకు మించి ఉండకూడదు.

  • అవసరమైన పత్రాలు (Required Documents)
  • ఆధార్ కార్డు.
  • వైట్ రేషన్ కార్డు (తెల్ల రేషన్ కార్డు).
  • డ్రైవింగ్ లైసెన్స్.
  • ఆటో/టాక్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC).
  • బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ (అకౌంట్ వివరాలతో మొదటి పేజీ).
  • కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే).
  • నివాస ధ్రువీకరణ పత్రం.
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో.

దాదాపుగా కూటమి ప్రభుత్వం ఇవే రూల్స్ మీ అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో అధికారికంగా  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

Read Also :