Medigadda : విషయం లేకుండా చిల్లరమాటలు.! మేడిగడ్డ వాస్తవాలు..

Medigadda : నిన్న మొన్న కొందరు కాంగ్రెస్ మిత్రులు..
మేడిగడ్డ బ్యారేజీ పైకి వెళ్లి(అలా బ్యారేజీ మీదకు ప్రయివేటు వ్యక్తులను అనుమతించకూడదు. కానీ అధికారులు అనుమతించారు. ఇక్కడే మీకు అసలు విషయం అర్థం కావాలి)..
చేతులతో కొన్ని కాంక్రీట్ ముక్కలు తొలగిస్తూ..
మేడిగడ్డ పని అయిపోయింది..
ఇంత ఘోరంగా కడతారా..?
ఇక్కడికి వచ్చి కొందరు పెయిడ్ ఆర్టిస్టులు నీళ్లు ఎత్తట్లేదని మాట్లాడుతున్నారు.. అని వీడియోలు చేశారు..

అలా మాట్లాడిన ఆ అధికార పార్టీ పెయిడ్ ఆర్టిస్టులకు చెప్పేదేందంటే..

ఈ రెండు కూడా సర్కారు వారి ఆస్థాన పత్రికలే..

మొదటిది(డెక్కన్ క్రానికల్) 2024 జులై..3 లక్షల క్యూసెక్ వరద..
రెండోది(వెలుగు) 2026 సెప్టెంబర్.. 1 లక్ష క్యూసెక్ కు పైగా వరద..

రెండు వార్తలు కూడా మేడిగడ్డలోని రెండు పిల్లర్లు కుంగిన తర్వాతే వచ్చాయి కదా..

మరి అంత వరద వచ్చినా..
ఆల్రెడీ కుంగిన పిల్లర్లు గానీ..
మిగతా 83(మొత్తం 85)పిల్లర్లు గానీ..
ఎందుకు కుంగలేదు..
కనీసం..
ఆల్రెడీ కుంగిన పిల్లర్లు అయినా కాస్తో.. కూస్తో అటో.. ఇటో జరగాలి..
మీరు చెప్పిన ప్రకారంగా చూస్తే మొత్తమే కొట్టుకుపోవాలి కదా.!

మరి అది ఎందుకు జరగలేదు.?

ఫైనల్ గా చెప్పొచ్చేదేందంటే..
ఇక్కడ..
తెలంగాణ ప్రజలకు..
అబద్ధాలు చెబుతున్నది ఎవరు.?
నిజాలు చెబుతున్నది ఎవరు.?

సివరాకరికి..
అక్కడి దాకా వెళ్లారు సరే..
అక్కడ బ్యారేజీ మీదకు వస్తున్న జనాలతో మాట్లాడించి.. మీరు వీడియోల్లో చెప్పిన విషయమే వాళ్లకు చెప్పాల్సింది.

వాళ్లే చెప్పేవాళ్లు మీకు “సరైన సమాధానం”.!

 

medigadda

medigadda1

medigadda 2