HYDRAA : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రాను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను దానికి కమిషనర్ గా నియమించింది.
గతంలో డీఆర్ఎఫ్ (DRF)పేరుతో ఉన్న సంస్థను హైడ్రాగా(HYDRAA) మార్చింది. హైదరాబాద్ లో సర్వరోగ నివారిణి, సకల సమస్యలకు అదే పరిష్కారం అని చెప్పింది.
కానీ అక్కడే సమస్య మొదలైంది. హైడ్రా వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ(GHMC), మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవరేజీ బోర్డు (HMWSSB)పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. ఎవరు ఏ పని చేస్తున్నారో.. చేస్తారో కూడా తెలియని పరిస్థితి.
జీహెచ్ఎంసీ అయితే ఉత్సవ విగ్రహంగా మారిపోయింది. ఇప్పుడు ఏ పని కోసం ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియని పరిస్థితి.
పైగా హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అండ్ సీవరేజీ బోర్డు అధికారుల మధ్య కొట్లాట కూడా మొదలైంది.
Read Also : మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం..!
Read Also : ఈ కొత్త హీరోయిన్ మీకు తెలుసా.?
తాజాగా జరిగిన ఒక ఘటనతో అది పూర్తిగా బట్టబయలైంది.
ఓల్డ్ సిటీలో ఓ చిన్నారి మ్యాన్ హోల్ లో పడితే.. అది తమ బాధ్యత కాదంటే.. తమ బాధ్యత కాదని మూడు శాఖలు చేతులు దులుకున్నాయి.
దీంతో అసలు హైడ్రాను ఎందుకు తెచ్చారు.? వసూళ్ల కోసమేనా అన్న ఆరోపణలు వస్తున్నాయి. పేదల ఇళ్లు కూలుస్తూ పెద్దలను భయపెడుతూ.. బడా సంస్థల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

