Jagdeep dhankhar : భారత 15వ.ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం చేయించారు.
అయితే ఈ ప్రమాణ స్వీకారం వేళ ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అదేంటంటే ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హాజరయ్యారు. మరో మాజీ ఉప రాష్ట్రపతితో కలిసి ఆయన. ముందు వరసలో కూర్చున్నారు.
ఇందులో సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వాస్తవానికి జగదీప్ ధన్కర్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను అని చెప్పి ఆయన ఆ పదవి నుండి తప్పుకున్నారు.
ఆ తరవాత ఆయన కనిపించకుండా పోయారు. దీంతో ప్రతిపక్షాలు జగదీప్ ధన్కర్ ఎక్కడ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు చేసింది.
ఇన్నాళ్లకు ప్రత్యక్షమైన మాజీ ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్కర్..
కొత్త ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్.. ప్రమాణస్వీకారానికి హాజరు… pic.twitter.com/NuFmKOUFDz
— Prabhakar Venavanka (@Prabhavenavanka) September 12, 2025
Read Also :
- బర్రెలా ఉన్నావంటూ అనసూయపై తిట్ల వర్షం..!
- ఈ కొత్త హీరోయిన్ మీకు తెలుసా.?
- ఏ బీర్ తాగితే మంచిదంటే.?
- బీఆర్ఎస్ కు షాకిచ్చిన ఎమ్మెల్యేలు.!
ఈ క్రమంలో ఆయన ఇక్కడ ప్రత్యక్షం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక సి.పి. రాధాకృష్ణన్ పూర్తిపేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ .1957 అక్టోబర్ 20న తమిళనాడు తిరుప్పూర్ లో జన్మించారు. 1998, 1999 కోయంబత్తూరు ఎంపీగా గెలిచిన సి.పి. రాధాకృష్ణన్ – 2004-2007 మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
తమిళనాడులో గతంలో రథయాత్ర నిర్వహించిన రాధాకృష్ణన్ , 93 రోజులపాటు 19 వేల కిలోమీటర్ల మేర రథయాత్ర నిర్వహించారు..గతంలో ఆయన ఝార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు. ‘తమిళనాడు మోదీ’గా సి.పి. రాధాకృష్ణన్ కు బీజేపీలో పేరుంది.
తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి పీఠం అధిష్టించిన మూడో వ్యక్తి రాధాకృష్ణన్ కావడం విశేషం.- గతంలో తమిళనాడు నుంచి ఉప రాష్ట్రపతులుగా సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్. వెంకటరామన్ ఎన్నికయ్యారు

