BC Reservations : బిగ్ బ్రేకింగ్ న్యూస్ – పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్..!

breaking news-batukamma

BC Reservations : తెలంగాణలో రిజర్వేషన్లు పెంచేందుకు లైన్ క్లియర్ అయింది. 50 శాతం నిబంధనను ఎత్తేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపారు.

governor-1 governor-1

దీంతో పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం అయ్యింది. త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు పలు హామీలు ప్రకటించింది.

అయితే..  రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండొద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలు దీనికి అడ్డంకిగా మారాయి. కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా.. రిజర్వేషన్ల అంశం తేల్చడం లేదని విపక్షాలు, బీసీ సంఘాలు మండిపడ్డాయి.

రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల పంచాయతీ ఎన్నికలు కూడా ఆలస్యమవుతున్నాయి. 42 శాతం రిజర్వేషన్లకు క్లియరెన్స్ వచ్చాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి.

ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. కానీ దీనికి గవర్నర్ ఆమోదం లభించలేదు. నెలల తరబడి అది పెండింగ్ లోనే ఉండిపోయింది.

తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీ, మున్సిపల్ చట్టాలకు సవరణ చేస్తూ బిల్లులు ప్రవేశపెట్టారు. వాటిని ఇప్పుడు గవర్నర్ ఆమోదించారు