Jubilee Hills bypoll : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగబోతోంది. దీంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల కన్ను జూబ్లీహిల్స్ పై పడింది.
అక్కడ రాజకీయం ఎలాఉండబోతోంది..? ఎవరు పోటీ చేయబోతున్నారు.? కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తుంది.? బీజేపీ ఎవరికి ఇస్తుందనే విషయాల మీద జోరుగా చర్చ జరుగుతోంది.
వీటన్నింటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
మూడు పార్టీలు కూడా ఈ బైపోల్ పై(Jubilee Hills bypoll ) బలంగా ఫోకస్ పెట్టాయి. అయితే.. కొత్తగా తెలుగుదేశం కూడా ఎంట్రీ ఇవ్వబోతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గ డామినేషన్ ఉన్న నియోజవర్గం కావడంతో తెలుగుదేశం రీ ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది.
మరోవైపు.. ఇటీవల బీఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన కవిత(kalvakuntla kavitha) కూడా జూబ్లీహిల్స్ బైపోల్ ద్వారా తన పొలిటికల్ కెరీర్ రీ స్టార్ట్ చేయబోతున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.
Read Also :
- జూమ్ కరో మ్యాజిక్ దేఖో..!
- TDPలోకి కేసీఆర్ కూతురు..?
- కేటీఆర్ ను ఇరికించబోయి ఇరుక్కున్న రేవంత్ రెడ్డి..?
ఇటీవలే ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్ నుండి వినిపిస్తోంది.
అయితే.. అన్ని పార్టీల వ్యూహాలకు, ప్రణాళికలకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ ముందుకెళ్తున్నట్టుగా చెబుతున్నారు. మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతతోనే(maganti sunitha) పోటీ చేయించే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల పట్ల నిబద్ధతతో, సేవ పట్ల అంకితభావంతో ముందుకు సాగుతున్న మాగంటి అక్షర,మాగంటి దిశిర..#MagantiGopinath #JubileeHills #BRS #KTR #PeopleFirst #jubileehillswithbrs #magantisunitha #Telangana #hydrabad pic.twitter.com/BpXzn2NFi2
— Maganti Gopinath (@magantigopimla) September 9, 2025
గోపీనాథ్ ఫ్యామిలీకి కూడా స్థానిక నాయకత్వంతో ఉన్న సత్సంబంధాలు కలిసి వస్తాయని.. సామాజిక వర్గ కోణం కూడా పనిచేస్తుందని అంటున్నారు.
అలాగే సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే.. గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో బైఎలక్షన్ వచ్చింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, లాస్య నందిత సోదరి అయిన నివేదితకు టికెట్ ఇచ్చారు.
కానీ అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరిన శ్రీగణేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో జూబ్లీహిల్స్ లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనే దిశగా కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే మాగంటి గోపీనాథ్ భార్య సునీత, ఇద్దరు కూతుళ్లు కూడా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. రెగ్యులర్ గా ప్రజలను కలుస్తున్నారు.
అంటే.. ఈ బై ఎలక్షన్ లో ఆమెకే టికెట్ పక్కా అని తెలుస్తోంది.
Read Also :
- ఫ్రంట్ పేజీ సాక్షిగా పరువు తీసుకున్న తెలుగు పేపర్లు..!
- శ్రష్టికి నాగార్జున బంపరాఫర్..!
- బతుకమ్మ చీరెలకు కండీషన్లు..!

