MLC Kavitha : కవిత సంచలన పోస్ట్.. టార్గెట్ ఎవరు..?

mlc kavitha sensational post

MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత రోజుకో బాంబ్ పేల్చుతూనే ఉన్నారు. తాను తెలంగాణ కోసం పనిచేస్తున్నానని ఆమె చెబుతున్నారు. తన తండ్రి కేసీఆర్ బాటలో నడుస్తున్నానని కూడా చెబుతున్నారు.

కానీ.. ఆమె పేలుస్తున్న బాంబులన్నీ కేసీఆర్ కే తగులుతున్నాయి. ఇప్పటికే కవిత(MLC Kavitha) మాట్లాడిన చాలా మాటలు కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ చేశాయి.

తాజాగా ఆమె తన ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు. కాళోజీ కవిత్వంలోన కొన్ని లైన్లను ఆమె పోస్ట్ చేశారు.

“ప్రాంతేతరుడు మోసం చేస్తే,

ప్రాంతం పొలిమేరల వరకు తరమికొడుతం.

ప్రాంతం వాడు మోసం చేస్తే,

ప్రాంతం లోపల పాతిపెడతాం.

     — కాళోజీ”

అంటూ.. ఆమె పోస్ట్ చేశారు.

అయితే ఇప్పుడు ఆమె.. ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టారనే చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి చుట్టూ దయ్యాలున్నాయని గతంలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి సంచలనంగా మారాయి.

తన తండ్రికి రాసిన లేఖలో కూడా అవే అంశాలున్నాయి. ఆ తర్వాత కూడా చాలా సార్లు ప్రెస్ మీట్ లలో కూడా బీఆర్ఎస్(Brs party) పార్టీలో కీలకంగా ఉన్న అనేక మంతి నాయకులపై ప్రత్యక్షంగా, రోక్షంగా ఆమె వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు కూడా వారినే ఉద్దేశించి అన్నారా.? లేకపోతే రాష్ట్రంలో ఉన్న పాలకులను ఉద్దేశించి అన్నారా..? అనేది జోరుగా చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లైతే.. ఆమె కేసీఆర్ గురించే అన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కేసీఆర్ ఆల్రెడీ పాతిపెట్టాం.. ఇక పూర్తిగా తొక్కిపెట్టాల్సిన పని మాత్రమే ఉందని కవిత పోస్ట్ కింద కామెంట్లు పెడుతున్నారు.

ఆమె పెట్టిన ప్రతీ పోస్ట్, మాట్లాడిన ప్రతీ మాట కేసీఆర్ (kcr)కే బుల్లెట్ లా తగులుతున్నా.. ఎందుకు వెనక్కి తగ్గడం లేదనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

..

Read Also :.