తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth rreddy) తిప్పలు తప్పేలా లేవు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అందరితో చీవాట్లు పెట్టించుకున్నారు.
ఏకంగా సుప్రీంకోర్టు కూడా ఈ ఇష్యూలో ఎంటర్ అయ్యింది. సర్కారుకు చీవాట్లు పెట్టింది. చీఫ్ సెక్రటరీని జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. ఈ వార్నింగ్ తో సర్కారు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. అవేవీ కూడా సర్కారును కాపాడేలా కనిపించడం లేదు.
ఇవాళ ఏకంగా సుప్రీంకోర్టు (Supreme Court) కమిటీ హైదరాబాద్ కు వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన విధ్వంసాన్ని స్వయంగా పరిశీలించనుంది.
వంద ఎకరాలకు పైగా భూమిలో నరికి వేసిన చెట్లు, అక్కడ జరుగుతున్న పనులను సుప్రీంకోర్టు బృందం పరిశీలిస్తుంది.
ఈ కమిటీలో పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, మరో ముగ్గురు సభ్యులు ఉన్నారు.
విద్యార్థులోనూ ఈ కమిటీ మాట్లాడే అవకాశాలున్నాయి. యూనివర్సిటీ అధ్యాపక బృందంతో కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది.
సాయంత్రం వీరు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు (Supreme Court) నివేదిక అందిస్తారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుతో తిట్లు తిన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తోంటే మరోసారి చీవాట్లు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : టాలెంట్ చూపించేస్తున్న యాంకర్ ఇందు..!