Ramky : 58వ ఇంజినీర్స్ డే సందర్భంగా రామ్‌కీ ఇన్‌ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ వై.ఆర్. నాగరాజు దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ నిర్మాణంలో, పర్యావరణ పరిరక్షణలో, భవిష్యత్తు సుస్థిరతలో ఇంజినీర్ల పాత్ర కీలకమని ఆయన అన్నారు.
ఈ ఏడాది ఇంజినీర్స్ డే థీమ్ “డీప్ టెక్ & ఇంజినీరింగ్ ఎక్సలెన్స్: డ్రైవింగ్ ఇండియాస్ టెకేడ్” అని గుర్తుచేసిన నాగరాజ, నీటి వనరుల పరిరక్షణలో ఇంజినీరింగ్ వైవిధ్యం అత్యంత అవసరమని అన్నారు.
Read Also : రాత్రి నుండి హాస్పిటల్స్ బంద్..!
దేశంలో రోజూ ఉత్పత్తి అవుతున్న 72,368 మిలియన్ లీటర్ల పట్టణ మురుగునీటిలో కేవలం 28 శాతం మాత్రమే శుద్ధి అవుతోందని, మిగిలిన 72 శాతం నేరుగా నీటి వనరులను కలుషితం చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే తాగునీటి సరఫరాలో 40-50 శాతం వరకు పైపుల లీకులు, దొంగతనం, మీటర్ల లోపాలు, చెల్లింపు లేని కనెక్షన్ల కారణంగా నష్టపోతుందని చెప్పారు. ఇది ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా నీటి భద్రత, ప్రజారోగ్యం, భవిష్యత్ నీటి లభ్యతపై ప్రభావం చూపుతోందని తెలిపారు.
Read Also : లవంగం తింటే తంబాకు అన్నరు:బండి సంజయ్
సుస్థిరమైన మౌలిక సదుపాయాల కోసం ఆవిష్కరణ, సమగ్రత, ప్రభావం అనే మూడు అంశాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. కేవలం నిర్మిస్తే సరిపోదు, మరింత మెరుగ్గా నిర్వహించాలని స్పష్టం చేశారు.
స్మార్ట్ ఎస్టీపీలు (STPs) మురుగునీటిని శుద్ధి చేయడమే కాకుండా అందులోని వనరులను పునరుద్ధరించాలని సూచించారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్లు రియల్ టైమ్ సెన్సార్ల ద్వారా లీకులను గుర్తించాలన్నారు. డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీతో భవిష్యత్తు అవసరాలను అంచనా వేయాలన్నారు.
Read Also :
- చెలరేగి పోతున్న సుష్మాభూపతి..!
- యోగా గురువుకు గట్టిగా ఆయిల్ పెట్టిన కిలేడీలు
- ఈ అందం వెనక ఇంత కథ ఉందా..?
ప్రభుత్వ విధానాల దిశా నిర్ధేశం కూడా ఈ ప్రణాళికలు సమర్థంగా అమలయ్యేలా ఉండాలని ఆయన సూచించారు.
ఇంజినీర్స్ డే సందర్భంలో, పరిశ్రమలు, ఇంజినీర్లు, విధాన నిర్ణేతలు కలిసి నీటి సమస్యలపై దృష్టి సారించాలని నాగరాజ పిలుపునిచ్చారు.
ప్రతి లీటర్ మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవడం, నీటి వృథా తగ్గించడం, పరిశ్రమల్లో పర్యావరణ హిత పద్ధతులు అనుసరించడం అవసరమని అన్నారు.

