Ponguleti : పొంగులేటి బయోపిక్.. కేసీఆర్ ఉంటడా.? ED రెయిడ్స్ ఉంటయా.?

Minister ponguleti srinivas reddy biopic

Ponguleti : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే వెండి తెరపైకి ఎక్కబోతున్నారు. ఆయన జీవిత చరిత్రతో త్వరలోనే సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయినట్టు తెలుస్తోంది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas reddy )వ్యక్తిగత, రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. సినిమా పేరు “శీనన్న”అని తెలుస్తోంది. పొంగులేటి పాత్రలో సుమన్ నటించనున్నారు.

బయ్యా వెంకట నర్సింహా రాజ్ డైరెక్టర్, నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. కాసర్ల శ్యాం  పాటలు రాస్తున్నారు.

అయితే.. ఇందులో ఏయే అంశాలను చూపించబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత, రాజకీయ అంశాలు ఉంటాయని చెబుతున్నారు. అందులో కేసీఆర్(Kcr) పాత్ర కూడా ఉంటుందా.? అనే చర్చ జరుగుతోంది.

ponguleti srinivas reddy biopic

రాజకీయ జీవితం చూపిస్తే.. వైఎస్ జగన్(YS Jagan mohan reddy), కేసీఆర్, రేవంత్ రెడ్డి (Revanth reddy)వంటి పాత్రలన్నీచూపించాల్సి ఉంటుంది. అలాగే వైఎస్సార్ సీపీ నుండి బీఆర్ఎస్ లోకి రావడం.. అందులో జరిగిన పరిణామాలు, ఆయన మాట్లాడిన మాటలు.. ఆ తర్వాత  కాంగ్రెస్ లో చేరడానికి దారి తీసిన పరిణామాల గురించి కూడా ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఎన్నికల సమయంలో ఆయన వ్యవహరించిన తీరు, పట్టుబడిన వేలకోట్ల రూపాయల గురించి ప్రస్తావిస్తారా లేదా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

అలాగే ప్రభుత్వంలో తానే నంబర్ టూ అని చెప్పుకోవడం, ముఖ్యమంత్రి పదవి కోసం తెరవెనక చేసిన ప్రయత్నాలు, గ్రూపు రాజకీయాల గురించి చూపిస్తారా అని అడుగుతున్నారు.

సర్కారులోకి రాగానే తన సొంత కంపెనీకి కాంట్రాక్టులు ఎలా వచ్చాయో అని కూడా తెరకెక్కిస్తారా లేదా అని అడుగుతున్నారు.

చివరకు తన కుమారుడు వాచ్ లు స్మగ్లింగ్ చేస్తూ దొరికిన పోయిన సీన్ కూడా ఉంటుందా.? అని ప్రశ్నిస్తున్నారు. ఇవేకాదు.. తన ఇంటిపై ఈడీ రెయిడ్స్ జరగడం.. మధ్యలోనే వదిలేసి ఈడీ వెళ్లిపోవడం.. ఇప్పటి వరకు కేసు నమోదు కాకపోవడానికి గల కారణాలనూ సినిమాలో వివరిస్తారు కావొచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు.

ఈడీ రెయిడ్స్ (ED Raids)జరిగినా కూడా కేసు ఎందుకు నమోదు కాలేదో అటు ఈడీ చెప్పడం లేదు. ఇటు పొంగులేటి చెప్పడం లేదు. దీంతో.. చాలా గ్రాండ్ గా సినిమాలో దాని గురించి చెప్తారు కావొచ్చని అంతా అనుకుంటున్నారు.

..

Read More :